Kalvakuntla Kavitha: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన విషయంలో కామెంట్స్ చేయడానికి ప్రధాన కారణం BRS పార్టీనే అని.. ఎందుకంటే పార్టీనే కాంగ్రెస్‌కు ఆ అవకాశం ఇచ్చిందని అన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ BRS పార్టీపై 25 వేల మెజార్టీతో గెలిచి అందరినీ విస్మయానికి గురిచేసిన సంగతి తెలిసిందే. గెలుపు అనంతరం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. KTR, హరీష్ రావులు అహంకారం, అసూయ తగ్గించుకుంటే మంచిది అని అన్నారు. ఇంటి ఆడబిడ్డని ఇంట్లో నుంచి గెంటేసి మహిళా నాయకులను గెలిపించలేదు అని మాట్లాడుతున్నారని అది ఎంత వరకు కరెక్ట్ అని రేవంత్ అభిప్రాయపడ్డారు.
ALSO READ: దెబ్బ మీద దెబ్బ.. ఏం చేయాలె?
దీనిపై కవిత స్పందించారు. గతంలో చాలా మంది కాంగ్రెస్‌కి చెందిన మహిళా నేతలు గాంధీ భవన్‌లో తమకు పదవులు ఇవ్వడం లేదని ధర్నాలు చేసిన రోజులు ఉన్నాయని.. వారి సంగతి పట్టించుకోకుండా రేవంత్ తన గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నారో తనకు అర్థంకావడం లేదని అన్నారు. అసలు ఏ పార్టీలోనూ మహిళా నాయకులకు న్యాయం జరగదని.. రేవంత్‌కు మహిళల పట్ల అంత మర్యాద, బాధ ఉంటే రాహుల్ గాంధీ దగ్గరికి కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ప్రియాంక గాంధీని నియమించు అని అడిగాలని సూచించారు. ఈరోజు తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కూడా గెలడంతో తన విషయాన్ని పావుగా వాడుకుంటున్నారని.. కాకపోతే దురదృష్టవశాత్తు ఆ అవకాశం ఇచ్చింది BRS పార్టీనే అని అన్నారు.





