Kalvakuntla Kavitha: ఎప్పుడూ లేనిది తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎక్స్‌లో తన అభిమానులతో చాట్ చేసారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. అయితే ఓ రాజకీయ నాయకురాలితో మాట్లాడేటప్పుడు రాజకీయాల గురించి, పార్టీ గురించి మాత్రమే మాట్లాడుతుంటారు. ఇవన్నీ సర్వసాధారణమే.
కానీ ఈసారి మాత్రం కవిత ఓ ఇంట్రెస్టింగ్ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఓ నెటిజన్ రామ్ చరణ్‌పై మీ అభిప్రాయం ఏంటి అని అడగ్గా.. మంచి వ్యక్తి. మంచి డ్యాన్సర్. కానీ నాకు చిరంజీవి అంటే అభిమానం. కాబట్టి రామ్ చరణ్ చిరంజీవి కంటే గొప్ప కాదని నా అభిప్రాయం అని సమాధానం చెప్పడం వైరల్ మారింది. కవిత ఇచ్చిన మరిన్ని ఆసక్తికర సమాధానాలు ఇవే..
2029 ఎన్నికల్లో పోటీ చేస్తారా?
తప్పకుండా
మీ పార్టీకి ఏం పేరు పెట్టాలనుకుంటున్నారు?
ఏ పేరు పెడితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు?
మీరు రాజకీయాల్లో వేస్ట్. వ్యాపారాలు చేసుకుంటే బెటర్
నువ్వు సోషల్ మీడియాలో ఉండి విషపూరితమైన ట్వీట్స్ చేయడం ఇంకా డేంజరస్. ముందు నువ్వు నీ మైండ్ సెట్‌ని శుభ్రం చేస్కో.
తెలంగాణలో ఇన్ని రాజకీయ పార్టీలను తట్టుకుని నిలబడే శక్తి మీకుందా?
ఉంది.
మీరు ముఖ్యమంత్రి అయితే తెలంగాణ రాష్ట్రానికి ఏం చేస్తారు?
నేను ముందుగా చేసే పని తెలంగాణలో ఉచిత విద్యను ఇవ్వడం. అదొక్కటి ఇస్తే చాలు తెలంగాణ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసినట్లు అవుతుంది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మీ అభిప్రాయం?
నెరవేర్చని హామీలతో ప్రజలు ఆల్రెడీ విసిగిపోయి ఉన్నారు.





