Juices in Winter: తెలుగు రాష్ట్రాల్లో చలి చంపేస్తోంది. బయటికి వెళ్లడం మాట దేవుడెరుగు. ఇంట్లో నేలపై కాళ్లు పెట్టాలంటేనే వణుకు పుడుతోంది. కొందరుంటారు.. ఎముకలు కొరికే ఈ చలిలో కూడా ఫ్యాన్ ఫుల్లుగా పెట్టుకుని నాలుగైదే రగ్గులు కప్పుకుని నిద్రపోతుంటారు. ఆ ఫీలింగే వేరనుకోండి. సరే.. అసలు విషయానికొద్దాం. చాలా మందికి పండ్లు వలుచుకుని తినమంటే ఎక్కడలేని బద్ధకం వచ్చేస్తది. అదే పండుని రసంగా చేసి ఇస్తే మాత్రం గ్యాప్ ఇవ్వకుండా తాగేస్తారు. మరి ఈ చలికాలంలో పండ్ల రసాలు తాగచ్చా? తెలుసుకుందాం.
ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. పండ్ల రసాల్లో షుగర్ ఎక్కువగా ఉంటుంది. ఇది వినగానే అదేంటి బ్రో చెక్కర వేసుకోకుండానే తాగుతున్నాం కదా అంటారు. మీరు చక్కర వేసుకోకపోయినా.. సహజంగా పండ్లలో ఫ్రక్టోస్ అనే నేచురల్ షుగర్ ఉంటుంది. నేరుగా తింటే ఆ ఫ్రక్టోస్‌తో పాటు పండ్లలో ఉండే ఇతర పోషకాలు కూడా శరీరానికి అందుతాయి. అదే మీరు మిక్సీలో వేసి తిప్పేసి వడగట్టి తాగేస్తే మహా అంటే 10% పోషకాలు అందుతాయేమో. మిగతా 90% షుగరే ఉంటుంది.
కాస్తో కూస్తో వేసవి కాలంలో ఈ జ్యూసులు మేలు చేస్తాయి. ఎందుకంటే వేసవిలో డీహైడ్రేట్ అవుతాం కాబట్టి. కానీ చలికాలంలో జ్యూసులు తీసుకోకపోవడమే బెటర్. మ్యాగ్జిమమ్ వేడి వేడి పదార్థాలను తినేందుకు ప్రయత్నించండి. అంతగా ఏదన్నా తాగాలని నోరూరుతుంటే.. మిరియాలు వేసి చేసిన రసాలు, కషాయాలు తాగండి. ఇవి చిన్న గ్లాసుకు తాగితే జలుబు, దగ్గు నుంచి ఉపశమనం ఉంటుంది. కాబట్టి.. ఈ చలికాలంలో పండ్ల రసాలకు కాస్త బ్రేక్ ఇస్తే మంచిది.





