Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ దగ్గరపడుతున్న సమయంలో స్పిన్నర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) షాకిచ్చాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో బుమ్రా లేనట్టే అని BCCI వర్గాలు అంటున్నాయి. ఇందుకు కారణం మొన్న జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఐదో టెస్ట్ సమయంలో బుమ్రాకు బ్యాక్ పెయిన్ వచ్చింది. దాంతో ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నాడట. దాంతో ప్రస్తుతం బుమ్రా పూర్తిగా కోలుకునేందుకు అతన్ని బెంగళూరులోని NCA (నేషనల్ క్రికెట్ అకాడమీ)కి పంపించారు.
మూడు వారాల పాటు అతన్ని అబ్సర్వేషన్‌లో ఉంచనున్నారు. అయితే ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో బుమ్రాను ఉంచాలా వద్దా అని BCCI తలమునకలవుతోంది. 15 మెంబర్ స్వ్కాడ్‌లో కాకపోయినా కనీసం రిజర్వ్ ప్లేయర్‌గా ఉంచాలని భావిస్తోంది. పూర్తిగా కోలుకున్న తర్వాత బుమ్రా మళ్లీ ఫిట్‌నెస్ పరంగా రికవర్ అవ్వడానికి ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా చివరి గ్రూప్ మ్యాచ్ మార్చి 2న జరగనుంది. సెమీ ఫైనల్స్ మార్చి 4, 5 తేదీల్లో ఫైనల్ మ్యాచ్ మార్చి 9న జరగనున్నాయి. బుమ్రా లేకపోతే కష్టం అయిపోతుంది కాబట్టి BCCI అతన్ని రిజర్వ్ ప్లేయర్‌గా ఉంచి… ఈలోగా అతను కోలుకుంటే ఆడే అవకాశం ఉంటుందని భావిస్తోంది. (Champions Trophy)