Jagan Mohan Reddy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈరోజు తన 53వ పుట్టినరోజును జరుపుకున్నారు. కూటమి నేతలు, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో పాటు ఎందరో సెలబ్రిటీలు, అభిమానులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు విషెస్ తెలిపారు. జగన్‌కు బర్త్‌డే విషెస్ తెలిపిన రాజకీయ నాయకుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, APCC అధ్యక్షురాలు, జగన్ సోదరి షర్మిళ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి KCR, BRS పార్టీ వర్కింగ్ అధ్యక్షుడు KTR తదితరులు ఉన్నారు.
అయితే.. జగన్ తనకు విషెస్ తెలిపిన వారిలో ముఖ్యమైన వారికి మాత్రమే ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్స్ చేసారు. షర్మిళకు రిప్లై ఇస్తూ థ్యాంక్యూ షర్మిళమ్మా అని సమాధానం ఇవ్వగా.. మిగతా వారికి సాధారణంగా ధన్యవాదాలు అని చెప్పారు. కానీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కి, తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుల ట్వీట్స్‌కి ఆయన రిప్లై ఇచ్చిన విధానం ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఇంతకీ జగన్ ఏమని సమాధానం ఇచ్చారంటే.. నాకు విషెస్ తెలిపినందుకు ధన్యవాదాలు గవర్నర్ గారూ.. మీ నుంచి విషెస్ రావడం నిజంగా నాకెంతో సంతోషంగా ఉంది అని అన్నారు. ఇలా తెలంగాణ మంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు ఇతర నేతలకు కూడా ఇదే విధంగా రిప్లై ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన నేతలకు మాత్రం ధన్యవాదాలు అని చెప్పి వదిలేసారు.





