Jagan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం.. పర్సనల్ విషయాల గురించి వెకిలిగా మాట్లాడటం వంటివి చేయొద్దని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి.. తన పార్టీ నేతలకు చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎన్నికల సమయంలో.. ఎన్నికలయ్యాక కొన్ని నెలల పాటు జగన్ కూడా పవన్ కళ్యాణ్‌ను దత్తపుత్రుడు, మూడు పెళ్లిళ్లు, ప్యాకేజీ స్టార్ అంటూ కించ పరిచే విధంగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
కానీ ఇప్పుడు జగన్‌లో చాలా మార్పు వచ్చింది. ఆయన ఈ మధ్యకాలంలో ప్రెస్‌మీట్లలో పవన్ కళ్యాణ్ పేరును ప్రస్తావించడంలేదు. ఇందుకు కారణం ఉంది. గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి గల కారణాల్లో కాపు ఓటర్లు వ్యతిరేకం అవడం ఒకటి. పవన్ కూడా కాపు వర్గానికి చెందినవారే. కాబట్టి.. పవన్‌ను తిడితే ఈ వర్గానికి చెందిన వారు ట్రిగ్గర్ అవుతున్నారట. ఈ విషయాన్ని గ్రహించిన జగన్ కాపు వర్గాలను పర్సనల్ టార్గెట్స్‌గా చేయకండి అని హెచ్చరించినట్లు తెలుస్తోంది.
ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుకి బదులు నారా లోకేష్ బాధ్యత తీసుకుంటున్నారని కూటమిలో టాక్ నడుస్తోంది. ఇదే జరిగితే ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ కూటమి నుంచి తప్పుకుంటారని తెలుస్తోంది.





