Jada Sravan Kumar: ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా.. కూటమి పాలనపై పరిస్థితులపై మాట్లాడేవారిని గూండాలు, రౌడీలు అంటున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై షాకింగ్ వ్యాఖ్యలు చేసారు జై భీమ్ పార్టీ అధినేత జడ శ్రవణ్ కుమార్. కనక సింహాసనంపై శునకాన్ని కూర్చోబెట్టినా అశుద్ధాన్ని చూడగానే అక్కడికే వెళ్తుంది అన్న చందంగా పవన్ కళ్యాణ్ ప్రవర్తిస్తున్నారని అన్నారు.
ఎన్నికలకు ముందు నేను తప్పు చేసినా.. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోయినా నా చొక్కా పట్టుకుని నిలదీయండి అన్న పవన్ కళ్యాణ్‌ను చంద్రబాబు నాయుడును ఈరోజు ఏ చెప్పుతో కొట్టాలి మరి? అంటూ వాపోయారు. తన గురించి మాట్లాడినా.. కూటమి పాలనను తప్పు అంటూ ఎవడైనా మాట్లాడితే చెప్పుతో కొడతా అని ఆ రోజు చెప్పు ఎత్తి చూపించిన పవన్‌ను మరి ఈరోజు ఏ చెప్పుతో కొట్టాలి అంటూ వ్యాఖ్యలు చేసారు.





