IPL Auction 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో భాగంగా.. ఈరోజు జరిగిన IPL వేలంలో ఎన్నో ట్విస్ట్‌లు కనిపించాయి. బేస్ ప్రైజ్ తక్కువ పెట్టినా కూడా కొందరు క్రికెటర్లను కొనుగోలు చేసేందుకు ఏ మేనేజ్మెంట్ కూడా ముందుకు రాలేదు. అందులో పృథ్వీ షా ఉండటం చాలా మందిని విస్మయానికి గురిచేసింది. బేస్ ప్రైజ్ రూ.75 లక్షలు పెట్టినా ఒక్కరు కూడా కొనేందుకు ముందుకు రాలేదు. ఈ వేలంలో అమ్ముడుపోని క్రికెటర్లు వీరే..
జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్
పృథ్వీ షా
డెవాన్ కాన్వే
సర్ఫరాజ్ ఖాన్
గస్ అట్‌కిన్సన్
రాచిన్ రవీంద్ర
లియామ్ లివింగ్‌స్టోన్
వియాన్ ముల్డర్
దీపక్ హుడా
కేఎస్ భరత్
రహ్మానుల్లా గుర్బాజ్
జానీ బెయిర్‌స్టో
జేమీ స్మిత్
ఇక అత్యధిక వేలంలో అమ్ముడుపోయిన క్రికెటర్ కెమెరూన్ గ్రీన్. కలకత్తా నైట్ రైడర్స్ ఇతన్ని 25.20 కోట్లకు కొనుగోలు చేసింది.






