Indians in Russian Tanker రష్యాకి చెందిన ఆయిల్ ట్యాంకర్‌ను అమెరికన్ మిలిటరీ స్వాధీనం చేసుకుంది. ఆ ట్యాంకర్‌లో ముగ్గురు భారతీయ ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది. రష్యాకి చెందిన మారినెరా అనే ఆయిల్ ట్యాంకర్ ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా ప్రయాణిస్తున్నట్లు సమాచారం రావడంతో అమెరికన్ మిలిటరీ అప్రమత్తమై ట్యాంకర్‌ను స్వాధీనం చేసుకుంది.
ఆ ట్యాంకర్ వెనెజ్వెలా దేశానికి సంబంధించినదని అమెరికా ఆ దేశంపై విధించిన ఆంక్షలను ఉల్లంఘించినందుకు ట్యాంకర్‌ను స్వాధీనం చేసుకున్నామని అమెరికన్ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ట్యాంకర్‌లో మొత్తం 28 మంది ఉన్నారు. వారిలో ముగ్గురు భారతీయులు ఉన్నట్లు గుర్తించారు. ఈ మారినెరా లాంటి ట్యాంకర్లను అమెరికా షాడో ఫ్లీట్ అని పిలుస్తుంది. ఈ ట్యాంకర్లను అమెరికా ఆంక్షలను విధించిన దేశాల నుంచి రహస్యంగా దాటిస్తుంటారు.





