India Nato Issue భారత విదేశాంగ శాఖ NATO చీఫ్‌కు వార్నింగ్ ఇచ్చింది. నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రూట్టే (Mark Rutte) తనకు తాను ఊహించేసుకుని మీడియా ముందుకు వెళ్లి భారత ప్రధాని నరేంద్ర మోదీపై (Narendra Modi) కామెంట్స్ చేయడం వివాదాస్పదంగా మారింది. అమెరికా (USA) భారత ప్రభుత్వంపై విధిస్తున్న ట్యారిఫ్‌లు రష్యాపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని.. ఈ నేపథ్యంలో మోదీ.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) మధ్య కీలక సంభాషణ జరిగిందని రూట్టే అన్నారు. ఆ సంభాషణ ప్రకారం.. రష్యా ఉక్రెయిన్‌పై చేస్తున్న యుద్ధానికి సంబంధించిన స్ట్రాటజీ గురించి మోదీ అడిగి తెలుసుకున్నారని అన్నారు. దీనిపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. అసలు మోదీ, పుతిన్‌ల మధ్య ఎలాంటి సంభాషణ జరగలేదని.. ఏవేవో ఊహించేసుకుని మీడియా ముందుకు వచ్చి ఇలాంటి సున్నితమైన అంశాలపై కామెంట్స్ చేయడం మానుకుంటే మంచిదని వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటికీ నాటో, ఐరోపా దేశాలు రష్యా నుంచి చమురు కొంటున్నాయని దాని గురించి ఎందుకు మాట్లాడరు అని భారత్ గడ్డిపెట్టింది.
ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) భారత్‌కు చెందిన వస్తువులపై భారీగా ట్యారిఫ్‌లు విధించారు. రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకుంటున్న చమురు, చమురుకు సంబంధించిన వస్తువలపై ఇంకా భారం పడింది. రష్యా ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న నేపథ్యంలో ఆ యుద్ధాన్ని ఎలాగైనా ఆపాలని.. అలా ఆపాలంటే భారత్ రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకోకూడదని ట్రంప్ భావిస్తూ ఈ ట్యారిఫ్‌లు విధించారు. ఈ రకంగా రష్యాకు ఉక్రెయిన్‌పై యుద్ధం చేసేందుకు నిధులు సమకూరవని ట్రంప్ భావిస్తున్నారు.