India Capital: మన భారత రాజధాని ఢిల్లీ అన్న సంగతి తెలిసిందే. అయితే.. రాజధాని మారిస్తే బాగుంటుంది అంటూ ఓ యువతి మాట్లాడిన వీడియో వైరల్ అవడంతో నెట్టింట ఇప్పుడు దీని గురించే డిస్కషన్ జరుగుతోంది. ఢిల్లీకి చెందిన ఓ యువతి ఈ వ్యాఖ్యలు చేయడంతో మరింత వివాదాస్పదంగా మారింది. తన తల్లిదండ్రులతో కలిసి దాదాపు 15 ఏళ్ల పాటు ఢిల్లీలో ఉన్నానని.. అక్కడి పొల్యూషన్ భరించలేక బెంగళూరు షిఫ్ట్ అయ్యామని తెలిపింది.
పొల్యూషన్‌తో పాటు నేరాల విషయంలోనూ టాప్‌లో ఉన్న ఢిల్లీని భారత రాజధానిగా తీసేసి బెంగళూరును ప్రకటిస్తే బాగుంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఇది కేవలం తన సొంత ఒపీనియన్ మాత్రమే. తన వీడియో కాస్తా వైరల్ అవడంతో కర్ణాటకకు చెందిన వారు ఆమెను సపోర్ట్ చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల వారు మాత్రం భిన్నాభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.
మన దేశ రాజధానిగా ఢిల్లీని ఎంచుకోవడానికి పలు ఆసక్తికర కారణాలు ఉన్నాయి. అవేంటంటే..
మీరు మన భారతదేశ చిత్రపటాన్ని చూస్తే ఢిల్లీ నడిబొడ్డున ఉంటుంది. అంటే ఢిల్లీకి తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ రాష్ట్రాలు చుట్టూ ఉంటాయి.
భారతదేశానికి చెందిన చాలా మంది రాజులు కొన్ని వందల సంవత్సరాల పాటు ఢిల్లీ నుంచే పాలన చేసేవారు.
భారతదేశంలో బ్రిటిష్ పాలన నడుస్తున్నప్పుడు దేశాన్ని నడిపేందుకు అవసరమైన కార్యాలయాలు, రోడ్లు, భవనాలను ఆల్రెడీ ఢిల్లీలోనే నిర్మించేసారు. అప్పట్లో ఢిల్లీలో ఉన్నన్ని రోడ్లు దేశంలో ఇంకెక్కడా ఉండేవి కావు.
ముంబై, కలకత్తా లాంటి మహా నగరాలు కమర్షియల్ హబ్స్‌గా ఉండేవి. అంటే వాణిజ్య వ్యాపారాలకు ఈ రెండే టాప్ సెంటర్లు. ఒకవేళ ఈ రెండింటిలో ఏ ఒక్క నగరాన్నైనా దేశ రాజధానిగా ప్రకటించి ఉంటే.. రాజకీయ పవర్ అనేది కేవలం వ్యాపారం చేసే వారి వద్దే ఉండేది. కానీ ఢిల్లీలో ఇలాంటి వ్యాపారాలు ఏమీ లేవు. పరిపాలన, చారిత్రాత్మక అంశాలు మాత్రమే ఢిల్లీకి సొంతం. అందుకే దీనిని రాజధానిగా ఎంచుకున్నారు. అందుకే 1911లో బ్రిటిష్ ప్రభుత్వం కలకత్తాను రాజధానిగా తీసేసి ఢిల్లీని ప్రకటించింది. ఆ తర్వాత న్యూఢిల్లీ అనే మరో ప్రాంతాన్ని పరిపాలక రాజధానిగా మార్చింది. మనకు స్వాతంత్ర్యం వచ్చాక అనవసరంగా మార్పులు చేర్పులు చేయడం అనవసరంగా భావించి ఢిల్లీనే రాజధానిగా కొనసాగించారు.





