Manchu Manoj: తాను నటించిన భైరవ సినిమాను కన్నప్ప కంటే ముందు రిలీజ్ చేస్తున్నందుకు మంచు విష్ణు తనపై కోపం పెంచుకున్నాడని అంటున్నారు మంచు మనోజ్. మంచు మనోజ్ భైరవ సినిమాలో.. మంచు విష్ణు కన్నప్ప సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వ్యక్తిగతంగా కాకుండా పని విషయంలో పోటీ పడాలన్న ఉద్దేశంతో భైరవ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసామని.. దాంతో విష్ణు కన్నప్పను వాయిదా వేసుకున్నాడని తెలిపారు.
ఆ కోపాన్ని ఎలా తీర్చుకోవాలో తెలీక తన ఇంట్లోకి గూండాలను పంపి కార్లు, తన పిల్లలకు సంబంధించిన నగలు, వస్తువులు పగలగొట్టారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆయన నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసారు. విష్ణు కెరీర్ నిలబెట్టడం కోసం ఝుమ్మంది నాదం సినిమాలో తన తండ్రి మోహన్ బాబు తన చేత లేడీ గెటప్ వేయించారని అన్నారు. ఇప్పుడు లేడీ గెటప్‌లు చేయాల్సిన సమయం కాదు నాన్నా అని ఎంత చెప్పినా విష్ణు కోసం చేయాల్సిందే అని పట్టుబట్టడంతో వారి కోసం తాను ఒప్పుకున్నానని.. ఇంత చేసిన తన పట్ల ఇంత నీచంగా ప్రవర్తిస్తున్నందుకు చాలా బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేసారు.
విష్ణు తనకంటే పెద్దవాడని.. కూర్చుని మాట్లాడుకుందాం అని ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా ఇలా కుటుంబ గొడవల్ని బజారుకీడుస్తున్నాడని వాపోయారు. తన తండ్రి, అన్న సినిమాలకు తాను పని చేసినప్పుడు ఒక్క రూపాయి తనకు ఇవ్వలేదని.. ఇవి ఆస్తులకు సంబంధించిన గొడవలు కానే కావని అన్నారు. తనకు ఆస్తి వద్దు అని ఎప్పుడో చెప్పానని.. కాకపోతే విద్యానికేతన్ సంస్థలకు సంబంధించిన లొసగుల విషయంలో మాత్రం పిల్లల జీవితాలతో ఆడుకోవద్దని చెప్పినందుకే ఈ గొడవలు స్టార్ట్ అయ్యాయని స్పష్టం చేసారు.