Blue Aadhaar: పిల్లలకు సంబంధించిన బ్లూ ఆధార్ విషయంలో UIDAI కీలక అప్డేట్ ఇచ్చింది. UIDAI బిహేవియోరల్ ఇన్సైట్స్ లిమిటెడ్ (BIT) అనే సంస్థతో కలిసి 5 నుంచి 15 ఏళ్ల మధ్య పిల్లలకు మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్ ప్రవేశపెట్టింది. 7 నుంచి 15 ఏళ్ల మధ్య పిల్లలకు మాత్రం ఈ అప్డేట్ చేసుకోవడానికి ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదని ప్రకటించింది. ఈ అప్డేట్ ప్రక్రియ అక్టోబర్ 1 నుంచే అమల్లో ఉంది. ఇందుకోసం తల్లిదండ్రులు తమ పిల్లల్ని తీసుకుని దగ్గర్లోని ఆధార్ సెంటర్‌కు కానీ లేదా భువన్ ఆధార్ పోర్టల్‌లో (Bhuvan Aadhaar portal) కానీ బయోమెట్రిక్ అప్డేషన్ చేసుకోవచ్చు. పిల్లలకు ఇచ్చే ఆధార్‌ను బ్లూ ఆధార్ లేదా బాల్ ఆధార్ అని సంబోధిస్తున్నారు.
ఎందుకు?
UIDAI ఈ అప్డేషన్ను తీసుకురావడానికి ప్రధాన కారణం తల్లిదండ్రులకు పిల్లల ఆధార్ పట్ల సరైన అవగాహన లేకపోవడం.. వారికి సమయానికి అప్డేట్స్ లేకపోవడం. దీని వల్ల భవిష్యత్తులో పిల్లలకు ఉన్న ఆధార్ కార్డులో లోపాలు వచ్చే అవకాశం ఉంది. ఫలితంగా ప్రభుత్వం తరఫున రావాల్సిన పథకాలు ఆగిపోయే ప్రమాదం ఉంది. ఇటీవల కాలంలో 5 నుంచి 15 ఏళ్ల మధ్య ఉన్న కొన్ని లక్షల మంది చిన్నారులకు సంబంధించిన ఆధార్ కార్డుల్లో బయోమెట్రిక్స్ పాతబడిపోయి ఉన్నాయి. దీని వల్ల స్కూల్ అడ్మిషన్లు, ప్రభుత్వ పథకాలు, ట్రావెల్ ఐడీలు వంటివి రావడం లేదు. ఇది ఇప్పుడు జాతీయ సమస్యగ మారడంతో UIDAI మ్యాటర్ సీరియస్‌గా తీసుకుంది.





