TTD Ticket Booking On Whatsapp: ఇక శ్రీవారిని దర్శించుకునేందుకు చేసుకోవాల్సిన టికెట్ బుకింగ్‌ని సులభతరం చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇక టికెట్లను వాట్సాప్‌లోనే బుక్ చేసేసుకోవచ్చు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్సాప్‌లో మన మిత్ర పేరిట ఓ సర్వీస్‌ను యాడ్ చేసింది. అయితే.. ఇది కేవలం తిరుమల దర్శన టికెట్ల కోసమే కాదు.. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ దేవాలయాలకు సంబంధించిన అన్ని రకాల దర్శన టికెట్లను ఈ సర్వీస్ ద్వారానే బుక్ చేసేసుకోవచ్చు.
ఆలయాల్లో భక్తులు గంటలు తరబడి క్యూ లైన్లలో నిలబడి ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. మరి టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలి? సింపుల్.. 9552300009 ఈ నెంబర్‌కు వాట్సాప్‌లో హాయ్ అని పెట్టండి. ఆ తర్వాత మీకు కొన్ని ఆప్షన్లు కనిపిస్తాయి.
అందులో టెంపుల్ బుకింగ్ సర్వీసెస్ అనే ఆప్షన్ వస్తుంది. అది సెలెక్ట్ చేసుకోండి.
మీరు సెలెక్ట్ చేసుకున్న తేదీన దర్శనాలు ఉన్నాయో లేదో చాట్ బాట్ వెంటనే చెప్పేస్తుంది. ఆ తర్వాత పేమెంట్ లింక్ ద్వారా డబ్బులు చెలిస్తే ఆన్‌లైన్‌లోనే టికెట్ వచ్చేస్తుంది.
త్వరలో ఈ మన మిత్ర సర్వీస్ ద్వారా రూం బుకింగ్, రైలు టికెట్ బుకింగ్ సర్వీస్‌లను కూడా ప్రవేశపెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.