Tirumala తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే ప్రత్యేకమైన రోజు కావాలా? అంటే బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి లేదా ఇతర పండుగల సమయంలో దర్శనాలు చేసుకోవడం వరకు ఓకే కానీ.. నిజానికి శ్రీవారి దర్శనం అనేది ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా ఒక అందరికీ ప్రత్యేకమైన రోజున చేసుకోవాలట.
అందరికీ ప్రత్యేకమైన రోజు అంటే ఏముంటుంది అనుకుంటున్నారా? మామూలుగా అయితే పుట్టినరోజు నాడు ఎక్కువగా దర్శనం చేసుకుంటూ ఉంటారు. అది ఓకే కానీ.. పుట్టిన తేదీ కంటే జన్మ నక్షత్రం చాలా ముఖ్యం.
మీ జన్మ నక్షత్రం రోజున శ్రీవారిని దర్శించుకుంటేనే జన్మ సాఫల్యత ఉంటుందని జ్యోతిష్యులు కూడా చెప్తుంటారు. మరీ ముఖ్యంగా శ్రవణా నక్షత్రం రోజున శ్రీవారి దర్శనం చేసుకుంటే వ్యాపారాల్లో మంచి లాభాలు ఉంటాయని నమ్ముతారు.
ఇక సంతాన సమస్యలు ఉన్నవారు రోహిణి నక్షత్రం రోజున శ్రీవారిని దర్శించుకుంటే మంచిది. పంటలు సరిగ్గా పండక నష్టాలు వస్తున్నా.. పొలాలకు నీటి సమస్య ఉన్నా ఉత్తరాషాఢ నక్షత్రం రోజున దర్శించుకోవాలి.
ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కోసం కృత్తిక నక్షత్రం రోజు దర్శించుకోవాలట. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నవారు భరణి నక్షత్రం రోజున.. అనారోగ్య సమస్యలు ఉన్నవారు అశ్విని నక్షత్రం రోజున.. వైద్య రంగానికి చెందిన వారు శతభిష నక్షత్రం రోజున.. రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో రాణించాలనుకునేవారు ధనిష్ఠ నక్షత్రం రోజున దర్శనం చేసుకుని శ్రీవారికి దక్షిణ సమర్పించుకుంటే చాలా మంచిది.






