సముద్రపు అలలకు ఓ రైలే కొట్టుకుపోయిందంటే నమ్ముతారా? కానీ ఇది నిజం. ఎక్కడో కాదు. మన భారతదేశంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ విషాదం జరిగి 2026కి 59 ఏళ్లు అవుతోంది. అసలు ఏంటా విషాదం.. ఏం జరిగింది?
అది 1964 డిసెంబర్ 22. తమిళనాడులోని ధనుష్కోడిని తుపాను ముంచెత్తింది. భీకరమైన గాలులు.. ఎగిసిపడుతున్న సముద్రపు అలలు. అది కూడా మామూలు అలలు కాదు. రాక్షస అలలు. సరిగ్గా అదే సమయంలో పాంబన్ నుంచి ధనుష్కోడి ప్రాంతానికి ఓ ప్యాసెంజర్ రైలు వస్తోంది. రాత్రి ధనుష్ కోడి రైల్వే స్టేషన్‌కు రైలు చేరుకోగానే అలలు ముంచెత్తాయి.
ఆ అలల తాకిడికి రైలు రైలు కొట్టుకుపోయింది. రైలుతో పాటు పైలట్, ఆటో పైలట్‌తో పాటు ప్రయాణికులు సముద్రంలో కొట్టుకుపోయారు. ఆ సమయంలో రైలులో 200 మంది ప్రయాణికులు ఉన్నారు. ఏ ఒక్కరూ బతికి బయటపడింది లేదు. ఈ తుపాను ధనుష్కోడి ప్రాంతంలో దాదాపు 1800 మందిని పొట్టనబెట్టుకుంది. అదే సమయంలో తమిళనాడు ప్రభుత్వం ధనుష్కోడిని నివాసిత ప్రాంతం కాదని ప్రకటించింది. ఆ ప్రాంతంలో నివసిస్తూ తుపాను నుంచి తప్పించుకున్న వారిని రామేశ్వరానికి తరలించారు. ఆ ఘటన తర్వాత ధనుష్కోడిని ఓ గోస్ట్ టౌన్‌గా పరిగణించేవారు. ఇప్పుడు ధనుష్కోడిని ఓ టూరిస్ట్ స్పాట్‌గా పరిగణిస్తున్నారు. కానీ ఇప్పటికీ భారతదేశ చరిత్రలో తుపాను కారణంగా జరిగిన అత్యంత భీకర ప్రమాదం ఇదే అని ఇప్పటికీ చెప్తుంటారు.





