Elon Musk Angry On Trump: అమెరికా అధ్యక్ష పదవి డొనాల్డ్ ట్రంప్‌కే దక్కాలని ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) పాపం చాలానే కష్టపడ్డారు. ట్రంప్ ఎన్నికల క్యాంపైన్‌కి బాగానే ఫండ్స్ కూడా ఇచ్చాడు. ఎవరైనా ట్రంప్‌కి కాకుండా ప్రతిపక్షంలో ఉన్న కమలా హ్యారిస్‌కు మద్దతు పలికితే వారిని ట్విటర్‌లో (X) చీల్చి చెండాడేవాడు. అందుకే ట్రంప్‌కి ఎలాన్ మస్క్ బాగా నచ్చేసాడు. తన క్యాబినెట్‌లో మంచి హోదా కల్పించాలని అనుకున్నాడు. కానీ క్యాబినెట్‌లో ఇచ్చే పదవి కంటే తనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి (AI) సంబంధించిన భారీ ప్రాజెక్ట్‌లు కూడా ట్రంప్ ఇస్తాడని పాపం ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు మస్క్. కానీ ట్రంప్ చావు దెబ్బ తీసాడు.
అమెరికాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మౌకిక సదుపాయాలను ఏర్పాటుచేయాలన్న ఉద్దేశంతో మొన్న ట్రంప్ ప్రమాణ స్వీకారం చేస్తూ స్టార్ గేట్ (Star Gate) అనే ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు. ఈ స్టార్ గేడ్ ప్రాజెక్ట్ అమెరికాకు ఎంతో కీలకమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్ట్. దీనిని రూపొందించేందుకు 500 బిలియన్ డాలర్లు వెచ్చిస్తున్నారు. అయితే.. ఈ ప్రాజెక్ట్ తనకు దక్కుతుందని మస్క్ ఎంతో ఆశపడ్డారు. కానీ ట్రంప్ దీనిని ఓపెన్ AI సీఈవో సామ్ ఆల్ట్‌మ్యాన్ (Sam Altman) చేతిలో పెట్టారు. (Elon Musk Angry On Trump)
సామ్ ఆల్ట్‌మ్యాన్‌తో పాటు ఒరాకిల్ ఛైర్మన్ లారీ ఆలిసన్, సాఫ్ట్ బ్యాంక్ సీఈవో మసాయోషి సన్ కూడా భాగస్వామ్యులుగా ట్రంప్ ఎంపిక చేసుకున్నారు. ఎన్వీడియా సంస్థ కూడా భాగం అనే టాక్ వస్తోంది కానీ వారి నుంచి ఎలాంటి అధికారిక కన్‌ఫర్మేషన్ లేదు. ఈ ప్రాజెక్ట్ కోసం ట్రంప్ తనను కాకుండా తన ప్రత్యర్ధి అయిన సామ్ ఆల్ట్‌మ్యాన్‌ను తీసుకోవడం మస్క్‌కు నచ్చలేదు. దాంతో ట్విటర్‌ల వారిపై పడి ఏడవడం మొదలుపెట్టాడు. ట్రంప్‌ను ఏమీ అనలేక స్టార్ గేట్ ప్రాజెక్ట్ గురించి తప్పుగా మాట్లాడారు. (Elon Musk Angry On Trump)
500 బిలియన్ డాలర్లు ఇస్తామని అంటున్నారు కానీ అసలు అంత బడ్జెట్ లేదని.. తనకు విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం సాఫ్ట్ బ్యాంక్ దగ్గర ప్రస్తుతానికి కేవలం 10 బిలియన్ డాలర్లు మాత్రమే ఉన్నాయని అన్నారు. అంతేకాదు.. ఎవరైతే మైక్రోసాఫ్ట్, ఒరాకల్ లాంటి పాత చింతకాయ పచ్చడికి కాకుండా కొత్తవారికి ఎందుక అవకాశం ఇవ్వడంలేదని కామెంట్స్ చేస్తున్నవారికి మద్దతుగా సమాధానాలు కూడా ఇస్తున్నారు. ఒకప్పుడు ఓపెన్ ఏఐకి మస్క్ ఫండ్స్ ఇస్తుండేవాడు. కానీ మధ్యలో సామ్ ఆల్ట్‌మ్యాన్‌తో ఏదో వివాదం రావడంతో ఆయన ఓపెన్ ఏఐ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఫండింగ్ కూడా ఆపేసినట్లు తెలిపారు.
ఆ తర్వాత సామ్ ఆల్ట్‌మ్యాన్ చాలా ఒప్పందాలను, నిబంధనలను ఉల్లంఘించారంటూ పలు కేసులు కూడా వేసారు. దాంతో సామ్ ఆల్ట్‌మ్యాన్‌కి పోటీగా మస్క్ గ్రోక్ పేరుతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్‌ను ప్రవేశపెట్టారు. తన లక్ష్యం గ్రోక్ ఓపెన్ ఏఐని మించిపోవాలని.. చాట్ జీపీటీని కాకుండా అందరూ గ్రోక్‌ని వాడే రోజులు రావాలని మస్క్ తెలిపారు. అలాంటిది ఇప్పుడు ట్రంప్ స్టార్ గేట్ ప్రాజెక్ట్ సామ్ ఆల్ట్‌మ్యాన్ చేతిలో పెట్టడం మస్క్‌కు ఏమాత్రం నచ్చలేదు. మరి ఇప్పుడు కూడా ట్రంప్‌కి మద్దతు ఇస్తారా లేక తప్పుకుంటారా అనేది వేచి చూడాలి. (Elon Musk Angry On Trump)