Donald Trump – Simpsons: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్‌లో చనిపోబోతున్నారా? ఇది ఏ జ్యోతిష్యుడో చెప్పారని అనుకుంటే పొరపాటే. 2000 సమయంలో అమెరికాలో బాగా పాపులర్ అయిన ఓ కామెడీ షోలో ఈ విషయాన్ని బయటపెట్టారు. అసలు మ్యాటర్ ఏంటంటే.. సింప్సన్స్ అనేది అమెరికాలో బాగా పాపులర్ అయిన సిచువేషనల్ కామెడీ షో. ఇది 2000 సమయంలో అక్కడ ప్రసారం అయ్యింది. అయితే.. ఇప్పుడు ఈ షోకి సంబంధించిన ఓ సీన్ వైరల్ అవుతోంది.
ఎందుకంటే.. ఈ షోలో ట్రంప్‌ని పోలి ఉన్న వ్యక్తి అమెరికా అధ్యక్షుడు అవుతాడని.. 2025 ఏప్రిల్ 12న ఆయన చనిపోతాడని అప్పట్లోనే చూపించారు. ఇది 2025 సంవత్సరం కావడం.. పైగా ఏప్రిల్ నెల దగ్గర్లో ఉండటంతో ఇప్పుడు ఈ షోలోని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. దీనిపై సింప్సన్స్ ప్రొడ్యూసర్ మ్యాట్ సెల్మాన్ స్పందిస్తూ.. అసలు తమ షోలో ట్రంప్‌ని పోలిన వ్యక్తితో ఉన్న సన్నివేశాలే లేవని.. ఇవి 2017 నుంచి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని అన్నారు. వీటిని ఎవ్వరూ నమ్మద్దని కోరారు.