Donald Trump: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇంటిపై డ్రోన్ దాడి చేసారని చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని అన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. నోవ్‌గోరోడ్ ప్రాంతంలో ఉన్న పుతిన్ ఇంటిపై ఈ డ్రోన్ దాడి జరిగిందంటూ రష్యా వీడియోలు కూడా రిలీజ్ చేసింది. అయితే.. అసలు దాడి జరగడం వాస్తవమేనా అని తెలుసుకునేందుకు అమెరికన్ ఇంటెలిజెన్స్ వర్గాలను పంపానని.. వారు చేసిన విచారణలో అసలు దాడి జరగలేదని తేలిందని అన్నారు.
పుతిన్ నివాసం పరిసర ప్రాంతాల్లో ఏదన్నా జరిగి ఉండొచ్చు కానీ పుతిన్ ఇంటిపై ఉక్రెయిన్ దాడి చేసిందంటే అది ముమ్మాటికీ అబద్ధమే అని అన్నారు. అయితే.. ఇప్పుడు ట్రంప్ ఉక్రెయిన్‌కి మద్దతుగా మాట్లాడటానికి ఓ కారణం ఉంది. ఇటీవల ట్రంప్ జెలెన్‌స్కీని కలిసి తన దేశానికి రష్యాకి మధ్య జరుగుతున్న యుద్ధానికి ఎలా ఫుల్‌స్టాప్ పెట్టాలి అన్న అంశంపై చర్చలు జరిగాయి. వీరి మీటింగ్ తర్వాత ట్రంప్ మీడియా ముందుకు వచ్చి పుతిన్ అబద్ధాలు ఆడుతున్నాడని చెప్పడం గమనార్హం.





