Donald Trump Mocks Macron అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్‌ను పబ్లిక్‌గా వెక్కిరించి అతని పరువు తీసారు. రిపబ్లికన్ నేతలతో సమావేశమైన ట్రంప్.. ఫ్రాన్స్‌పై అమెరికా విధించిన ట్యారిఫ్‌ల గురించి ప్రస్తావించారు. ఫ్రాన్స్ వాసుల కంటే అమెరికన్లే మందులకు ఎక్కువ బిల్లులు చెల్లిస్తున్నారని కాబట్టి ఫ్రాన్స్ డ్రగ్స్ ధరలను పెంచాలని మాక్రాన్‌కు తాను చెప్పినట్లు తెలిపారు.
ఇందుకు మాక్రాన్ ఒప్పుకోకపోవడంతో.. ఫ్రాన్స్ దిగుమతులపై అమెరికా 25% ట్యారిఫ్స్ పెంచుతుందని భయపెట్టినట్లు తెలిపారు. దాంతో మాక్రాన్ భయపడి 10 డాలర్ల ధరను కాస్తా 30 డాలర్లకు పెంచుతానని తెలిపారట. తాను ట్యారిఫ్‌ల మాట ఎత్తగానే ఇతర దేశాలు కూడా తమ దేశాల్లో మందుల ధరలను పెంచేందుకు ఒప్పుకున్నట్లు చమత్కరించారు. అయితే.. మాక్రాన్ తనతో ఒక మాట చెప్పారని ఆయన్ను వెక్కిరించారు. డోనాల్డ్.. నీ చేతులు పట్టుకుని వేడుకుంటున్నాను. నువ్వు చెప్పినట్లే మందుల ధరలు పెంచుతాను. కానీ ఈ విషయం ఎవ్వరికీ చెప్పకు అని తనతో అన్నట్లు ట్రంప్ సెటైర్ వేసారు. ట్రంప్ వెకిలి చేష్టలపై ఇప్పటివరకు ఫ్రాన్స్ ప్రభుత్వం స్పందించలేదు.





