Donald Trump Meme Coin: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖాతాలో రూ.2000 కోట్లకు పైగా డబ్బు వచ్చి చేరింది. దీనికి ఆయనకు సంబంధించిన మీమ్ కాయినే కారణం. దీనిని $TRUMP meme coin గా ప్రవేశపెట్టారు. ఈ కాయిన్‌ను సలోనా బ్లాక్‌చైన్‌లో లాంచ్ చేసారు. ఈ కాయిన్‌ను లాంచ్ చేసిన 24 గంటల్లోనే 1000 శాతం విలువ పెరిగింది. ఈ కాయిన్‌ను దక్కించుకోవాలంటే ముందు టోకెన్ తీసుకోవాలి. టోకెన్ విలువ 36 డాలర్లు. మార్కెట్‌లో ఈ కాయిన్‌కి ఉన్న విలువ 7.18 బిలియన్ డాలర్లు. ఇది ఈ భూగ్రహం మీదే అత్యంత విలువైన మీమ్ కాయిన్ అని పేర్కొంటూ ట్రంప్ వారసుడు ఈ కాయిన్‌ను లాంచ్ చేసాడు. 2028 నాటికి ట్రంప్ టోకెన్ మార్కెట్ 24 బిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. రానున్న మూడు సంవత్సరాలలో మరిన్ని టోకెన్లు రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ ట్రంప్ కాయిన్‌ను పెట్టుబడిగానో.. స్థిరాస్థిగానో పరిగణించడానికి లేదు. ఈ కాయిన్‌పై ట్రేడింగ్ చేస్తే లాభాలు వస్తాయన్న గ్యారెంటీ కూడా లేదని ట్రంప్ కుటుంబం వెల్లడించింది.
అసలేంటీ ట్రంప్ కాయిన్?
ట్రంప్ కాయిన్ అనేది డిజిటల్ కరెన్సీ కాయిన్. ట్రంప్ బ్రాండ్, పాపులారిటీని దృష్టిలో పెట్టుకుని దీనిని లాంచ్ చేసారు. దీనిని క్రిప్టో మార్కెట్‌లో ట్రేడింగ్ కోసం వాడచ్చు అని ఓ పక్క చెప్తూనే మరో పక్క దీనిని ఎవ్వరూ కూడా పెట్టుబడిగా భావించకండి అంటున్నారు.ప్రస్తుతానికి క్రిప్టో మార్కెట్‌లో 200 మిలియన్ ట్రంప్ మీమ్ కాయిన్స్ లాంచ్ చేసారు. దీనిని రానున్న మూడేళ్లలో 800 మిలియన్‌కు పెంచనున్నారు. ఇది ట్రంప్ ముగ్గురు కొడుకులైన ఎరిక్, డొనాల్డ్ జూనియర్లు సొంతంగా లాంచ్ చేసారు. కాబట్టి ఇది వారి కుటుంబానికి చెందిన పెట్టుబడి అని చెప్పచ్చు. ఇలాంటి క్రిప్టో కాయిన్స్ లాభాలు కురిపిస్తాయన్న గ్యారెంటీ లేదు. కాబట్టి చిన్న పెట్టుబడిదారులు ఈ కాయిన్‌కి దూరంగా ఉంటేనే మంచిది. అయితే ఇది ఇండియన్స్ కూడా కొనుక్కోవచ్చా అనే అంశంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. (Donald Trump Meme Coin)