Death Penalty for Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకి బంగ్లాకి చెందిన అంతర్జాతీయ క్రైం ట్రిబ్యూనల్ మరణ శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే.. మరణ శిక్షకి ఉరిశిక్షకి తేడా చాలా మందికి తెలీక పోవచ్చు. చాలా మంది ఈ రెండూ ఒకటే అని పొరబడుతుంటారు. కానీ కాదు. స్వల్ప వ్యత్యాసం ఉంది. అదేంటో తెలుసుకుందాం.
మరణశిక్ష అంటే ఏంటి?
న్యాయస్థానం ఫలానా వ్యక్తికి మరణ శిక్ష విధించింది అంటే దాని అర్థం కేవలం లీగల్‌గా తీర్పు వెల్లడించింది అని. అంతేకానీ మరణ శిక్ష అమలు చేసిందని కాదు. మరణ శిక్ష విధించినప్పుడు ఆ దోషికి ఎలాంటి మరణ శిక్ష విధిస్తారో ముందే చెప్పరు. కోర్టు మరణ శిక్ష విధించన తర్వాత దోషి తన లాయర్లతో మాట్లాడుకుని ఆ మరణ శిక్షను వాయిదా వేసుకుంటూ రావడమో లేదా మెర్సీ పిటిషన్లు వేయించుకోడమో.. లేదా ఇతర దేశంలో ఉంటే ఆ మరణశిక్ష నుంచి తప్పించుకునే అవకాశం కూడా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా 60శాతం కేసుల్లో కోర్టులు మరణశిక్ష విధించినా అవి అమలు కాలేదు.
ఉరిశిక్ష అంటే ఏంటి?
పేరులో ఉన్నట్లే కోర్టు నిర్ణయించిన తేదీన దోషిని ఉరి తీయడాన్ని ఉరిశిక్ష అంటారు. ఉరిశిక్ష వేసాక కేవలం ఉరితీసి మాత్రమే దోషిని శిక్షించాల్సి ఉంటుంది. అంతేకానీ కాల్పులు జరపడం.. లేదా ఇతర ప్రయోగాల ద్వారా చంపడం కుదరదు. ఈ ఉరిశిక్ష అనేది దాదాపు 2,500 సంవత్సరాల నుంచి అమలు చేస్తూ వస్తున్న ప్రక్రియ. అన్ని శిక్షలతో పోలిస్తే ఉరిశిక్ష అనేది చాలా సింపుల్ ప్రక్రియ కావడంతో ఎన్నో దేశాలు అమలు చేస్తున్నాయి. భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లలో మాత్రమే మరణశిక్ష విధించినవారికి ఉరి వేసి శిక్షను అమలు చేస్తున్నాయి.
ఈ ఉరిశిక్షలో కూడా రెండు రకాలు ఉంటాయి. ఒకటి.. షార్ట్ డ్రాప్ హ్యాంగింగ్. ఇది చాలా పాత పద్ధతి. కేవలం మెడకు ఉరి తీసి ఊపిరాడకుండా చేసి శిక్ష విధించేవారు. మరొకటి లాంగ్ డ్రాప్ హ్యాంగింగ్. ఇది మోడ్రన్ పద్ధతి. అంటే దోషిని ఒక పెద్ద బల్లపై కానీ స్టూల్‌పై కానీ నిలబెట్టి ఉరి వేసాక ఆ బల్లను, స్టూల్ని తీసేస్తారు. దీని వల్ల ఒక్కసారిగా ఉరి పడి మెడ దగ్గర ఉండే సున్నితమైన ఎముక విరిగి చనిపోతారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే అన్ని మరణశిక్షలు ఉరిశిక్షలు కాదు కానీ.. అన్ని ఉరిశిక్షలు మాత్రం మరణశిక్షలే.
మరణశిక్షలు ఎక్కడ ఎలా అమలు చేస్తారు?
భారత్ – ఉరి
సౌదీ అరేబియా – తల నరికేస్తారు
అమెరికా – విషపూరిత ఇంజెక్షన్లు, గ్యాస్ ఛాంబర్లు, కరెంట్ షాక్, కాల్పులు
జపాన్ – ఉరి
1900 వరకు పబ్లిక్‌గా ఉరి తీసేవారు. ఆ తర్వాత మానవ హక్కుల దృష్ట్యా ఇలా పబ్లిక్‌లో ఉరి తీయడాలను నిషేధించారు. భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలి ఉరిశిక్ష పడింది జాతిపిత మహాత్మా గాంధీని చంపిన నథూరాం గాడ్సేకి. ఇక బంగ్లాదేశ్ విషయానికొస్తే… 2013లో అబ్దుల్ ఖాదర్ మొల్లా అనే వ్యక్తికి ఉరిశిక్ష పడింది.





