CSK: మొన్న జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆక్షన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ రవీంద్ర జడేజా, సామ్ క్యుర్రన్‌లను వదులుకుని మరీ సంజూ శాంసన్‌ను దక్కించుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ సుప్రీమ్ స్టార్ క్రికెటర్ అయిన ఎం ఎస్ ధోనీ 2026 ఐపీఎల్ ఆడాక రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ధోనీ తర్వాత అంతటి సీనియారిటీ ఉన్న క్రికెటర్ రవీంద్ర జడేజా. అలాంటప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ జడేజాను కచ్చితంగా రీటైన్ చేసుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ జడేజాను, క్యురన్‌ను వదులుకుని మరీ సంజూ శాంసన్‌ను తీసుకోవడం హైలైట్.
చెన్నై సూపర్ కింగ్స్ ఇలా ఎందుకు చేసింది అనేదానిపై టీం కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పందించారు. ఇక చెన్నై టీం ధోనీని మర్చిపోవాల్సిన సమయం ఆసన్నమవుతోందని.. ఆ తర్వాత ధోనీ రేంజ్‌లో ఆడే ఆటగాడు మాత్రమే కాకుండా టీంలో యువ క్రికెటర్లను తీసుకోవాలని నిర్ణయించామని అన్నారు. కేవలం రెండేళ్ల కోసమే అని కాకుండా ఇంకో ఐదారేళ్ల వరకు టీం బలంగా ఉండాలంటే యువ క్రికెటర్లు ఎంతో అవసరం అని అన్నారు. ఇంకా ధోనీ పేరు చెప్పుకుంటూ గడిపేయలేం కదా అని అభిప్రాయపడ్డారు.
అదీకాకుండా చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనింగ్ బ్యాటింగ్‌లో వీక్‌గా ఉంది. ఈ పాయింట్‌లో సంజు శాంసన్ స్ట్రాంగ్‌గా ఉన్నాడు. అదీకాకుండా ఇక టీంలో యువ క్రికెటర్లు ఉండాలన్న ఉద్దేశంతో సీనియర్లను పక్కన పెట్టి మరీ చెరో రూ.14.2 కోట్లు పెట్టి మరీ అన్‌క్యాప్డ్ ఆటగాళ్లైన ప్రశాంత్ వీర్, కార్తిక్ శర్మలను కొనుగోలు చేసింది.





