CPM Leader: శృంగారం పిల్లల కోసమే స్త్రీలు ఉండాలి కానీ ఎన్నికల్లో పోటీ చేయడానికి కాదు అని కేరళకు చెందిన CPM నేత సయ్యద్ అలీ మజీద్ షాకింగ్ కామెంట్స్ చేయడం వివాదాస్పదంగా మారింది. స్థానిక తెన్నల ప్రాంతంలోని పంచాయతీ ఎన్నికల్లో 47 ఓట్లతో గెలిచిన సయ్యద్.. ఆ ఆనందంలో సంబరాలు చేసుకునేందుకు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పై విధంగా నీచంగా మాట్లాడి హాట్ టాపిక్‌గా మారారు.
CPM ప్రత్యర్ధి పార్టీ అయిన IUML పార్టీ ఎన్నికల్లో మహిళలను పెట్టి ఓట్లు వేయించుకోవాలనుకున్నారని.. మహిళలు పెళ్లి చేసుకోవడం.. భర్తలతో శృంగారం చేసి పిల్లల్ని కనడానికి మాత్రమే పనికొస్తారని.. వారిని ఇలా బయటికి తీసుకొచ్చి ఇంటి పరువు తీసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. దీనిపై ఇతర పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.





