Bhuma Akhila Priya: వైసీపీకి చెందిన శిల్ప చక్రపాణి రెడ్డిపై హాట్ కామెంట్స్ చేసారు తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ. నా తమ్ముడు శిల్ప చక్రపాణిని మర్చిపోలేదు… తప్పుడు కేసులు పెడుతున్నారు అంటున్నాడు.. ఇంకా కేసులు పెట్టడం మొదలు పెట్టలేదు అని సెటైర్లు వేసారు.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చక్రపాణి చేసిన మోసాలు, దందాలపై ఇంకా కేసులు పెట్టడం మొదలుపెట్టలేదని.. కానీ ప్రస్తుతం తమ నాయకుడు చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి, ప్రజలు, వారికి ఉద్యోగాలు, పథకాలు అంటూ బిజీగా ఉండటంతో తాను ఇంకా కేసులు పెట్టడం షురూ చేయలేదని అన్నారు. వైసీపీ నాయకులు మీద కేసులు పెట్టండి అని చంద్రబాబు చిన్న సైగ చేస్తే ఆ పార్టీ నాయకులూ అంత రాష్ట్రం వదిలేసి పారిపోయేవాళ్లు అని అన్నారు.
“” ఈ శిల్పా చక్రపాణి ఇంకా కేసులు పెట్టకుండానే ఎందుకు భయపడుతున్నాడో అర్థంకావడంలేదు. ఒకవేళ కేసులు పెట్టాక ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలని ఉంది. ఆడవాళ్లను, రైతులను, ఉద్యోగులను మోసం చేసిన వ్యక్తి చక్రపాణి. తప్పుడు కేసులు పెట్టండి అని చంద్రబాబు నాయుడు చిన్న సైగ చేసినా రాష్ట్రంలో వైసీపీ నాయకులు ఒక్కరు కూడా మిగలరు “” అని భూమా అఖిల ప్రియ అన్నారు.