Banglore కర్ణాటక రాజధాని బెంగళూరులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ బాలుడిపై పోలీస్ కానిస్టేబుల్ లైంగిక దాడికి పాల్పడటంతో ఆ బాలుడు నేరుగా పోలీసుల వద్దకు వెళ్లాడు.
స్థానిక ఆర్టీ నగర్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న యమునా నాయక్‌ను ఓసారి నగరంలో ఉన్న ఫ్రీడమ్ పార్క్‌లో డ్యూటీ వేసారట.
ఆ సమయంలో ఇంటర్ చదువుతున్న బాలుడు అక్కడ కనిపించడంతో మాటలు కలిపి మాటి మాటికీ కలవాలని ఒత్తిడి చేసాడట. కలిసిన ప్రతీసారి లైంగికంగా వేధించేవాడని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోక్సో కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసారు.





