Back Scratching: వీపు దురదగా ఉన్నప్పుడు గోక్కుంటే ఎంతో హాయిగా ఉంటుంది కదూ..! మనకు అందకపోతే ఇంట్లో వారిని గోకమని చెప్తాం. ఇలా ప్రత్యేకించి వీపు గోక్కోడానికి కొన్ని సామాన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఈ వీపు గోకే సోది ఎందుకు చెప్తున్నావ్ రా బాబూ.. అనుకుంటున్నారా! ఈ తొక్కలో వీపు గోకే పనికే ఓ ఉద్యోగం ఉందంటే నమ్ముతారా? మీరు చదివింది నిజమే. వీపు గోకడం ఒక ఉద్యోగం.
ఎక్కడో తెలుసా? అమెరికాలో. ఈ వీపు గోకే ఉద్యోగానికి గంటకు 100 నుంచి 160 డాలర్ల వరకు చెల్లిస్తుంటారు. మసాజ్, స్పా ట్రీట్మెంట్స్ సెషన్స్ లాగే బ్యాక్ స్క్రాచింగ్ సెషన్స్ అక్కడ కామన్. దీనిని స్క్రాచ్ థెరపీ అంటారు. అది కూడా ఆడవాళ్లే తమ సున్నితమైన చేతులు, గోళ్లతో చేస్తారు. ఇలా చేయడం వల్ల శరీరంలోని హ్యాపీ హార్మోన్స్ అయిన సెరోటొనిన్, ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయట. దాదాపు 30 నుంచి 90 నిమిషాల పాటు ఇలా గోకుతారు. మరికొన్ని దేశాల్లో కేవలం ఈ ఉద్యోగం చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారట.





