Arya 3: ఏవిటి గురువు గారూ అంతగా ఆలోచించేస్తున్నారు? ఏమీ లేదురా.. ఆర్య 3 సినిమా గురించి ఒక రూమర్ విన్నాను. అది రూమర్ అయితే ఫర్వాలేదు కానీ నిజం అయితే మాత్రం నాలాగా ఎందరో ఫ్యాన్స్ హర్ట్ అవుతార్రా..! మీరు ఈ సినిమాలు చూడటం ఎప్పుడు మొదలుపెట్టారు గురువుగారూ..! నోర్ముయ్.. నేను మాత్రం మనిషిని కానా.. నాకు మాత్రం సినిమాలు ఎంజాయ్ చేయాలని ఉండదా. సరే.. శాంతించండి. ఇంతకీ ఇప్పుడు ఆర్య 3 గురించి వచ్చిన రూమరేంటి? ఎందుకు అంతగా ఆలోచిస్తున్నారు?
ఏమీ లేదురా.. ఆర్య సినిమా ఒకరికి కాదు ఇద్దరికి కాదు ఏకంగా ముగ్గురికి కెరీర్ ఇచ్చింది. అల్లు అర్జున్, సుకుమార్, నిర్మాత దిల్ రాజు. ఈ ముగ్గురూ ఈ సినిమాతో ఎక్కడికో వెళ్లిపోయారు. ఆ తర్వాత సుకుమార్ తీసిన ఆర్య 2 కూడా బ్రహ్మాండంగా హిట్ అయ్యింది. నన్నడిగితే ఆర్య 3 అవసరం లేదు. ఎందుకంటే సీక్వెల్స్ హిట్ అవ్వడం అనేది రేర్. అలాంటిది మూడో సీక్వెల్ కూడా తీయాలనుకోవడం సాహసమనే చెప్పాలి. ఇప్పుడు దిల్ రాజు, సుకుమార్ ఆర్య 3 తీసే పనిలో ఉన్నారు. అయితే.. ఆర్య 3కి సుకుమార్ కథ అందించడమే కాదు.. సహ నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు.
ఆల్ హ్యాపీస్ కదా.. ఇప్పుడేమైంది గురువుగారూ. అది కాదు రా చారీ.. ఆర్య 3 లో అల్లు అర్జున్ హీరో కాదట. అదేవిటి గురువు గారూ.. అల్లు అర్జున్‌ని కాకుండా ఆర్య పాత్రలో మనం ఎవ్వరినీ ఊహించుకోలేం కదా. నా బాధ కూడా అదే రా చారీ. సరే.. ఇప్పుడు హీరోగా ఎవర్ని పెడతారట. దిల్ రాజు మేనల్లుడు లేడూ… అదేరా రౌడీ బాయ్స్ సినిమాలో నటించాడు కదా.. ఆశిష్ రెడ్డి.. అతన్ని హీరోగా పెట్టి తీస్తున్నారట. ఇది ప్రస్తుతానికి రూమర్ అనే అనుకోవాలి. కానీ ఆ అబ్బాయి ఆర్య పాత్రకు సరిపోడు రా చారీ. అరెరె.. నేను కూడా బాయ్స్ సినిమా చూసాను గురువు గారూ.. నాకు పెద్దగా అతని యాక్టింగ్ నచ్చలేదు. అయినా మన ఇష్టాయిష్టాల గురించి ఎవరికి కావాలి చెప్పండి. మీరు అనవసరంగా ఈ సినిమా గురించి ఆలోచించి మనసు పాడుచేసుకోకండి. మనకు బోలెడు వ్రతాలు ఉన్నాయి. అవి చేసుకుందాం పదండి..!
అదీ నిజమేరా చారీ..! అయినా ఎంత మేనల్లుడైతే మాత్రం తీసే సినిమాల్లో హీరోగా సెట్ అవుతాడా లేదా అని చూసుకోరేంట్రా ఈ దిల్ రాజు గారు మాత్రం. మొన్న వారింటికి పూజకు వెళ్లినప్పుడు దీని గురించి అడుగుదాం అనుకున్నా. కానీ నాకు సంభావన ముఖ్యం అనుకుని ఏమీ మాట్లాడకుండా ఆశీర్వచనం ఇచ్చి వచ్చేసానురా..! ఇదెప్పుడు జరిగింది గురువుగారూ.. అయినా మీరు నన్ను పిలవనేలేదు. నువ్వు చందూతో బిజీ కదరా.. అందుకే నేనే వెళ్లాలే..! నాకు చందూ పడిపోయిందని మీకు కుళ్లు గురువుగారూ..! అది సరే కానీ.. అసలు ఆర్య 3 సినిమా అల్లు అర్జున్ చేయడం లేదు? ఇప్పుడు బన్నీ ఆర్య జోనర్‌లో లేడు రా.. మనోడు అంతర్జాతీయ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు అట్లీతో ఓ సినిమా తీస్తున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్‌తోనూ ఏదో సినిమా అనుకున్నాడట. ఇవన్నీ పెద్ద ప్రాజెక్ట్‌లు. ఈ సమయంలో ఆర్య 3 తీస్తే అంత బాగోదు అని ఫీలై ఉంటాడు. సరే.. పద మనం పంకజం గారింటికి వ్రతానికి వెళ్లాలి.