Anil Kumar Yadav: మా అధినేత జగన్ మోహన్ రెడ్డి అంటే ఉచ్చపడుతోందా? అందుకే ఆయన పర్యటనలను అడ్డుకుంటున్నారా అంటూ రెచ్చిపోయారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అనిల్ కుమార్ యాదవ్. కాకాణి గోవర్ధన్, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించాలని జగన్ నిర్ణయించుకున్నారని.. ఇందుకు నెల్లూరు వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంటే కావాలనే కూటమి ప్రభుత్వం లేనిపోని ఆంక్షలు విధించి జగన్‌ను ఆపాలని చూస్తోందని ఆరోపించారు.
“” వేలాది సంఖ్యలో జగన్‌కు స్వాగతం పలుకుతాం. దానికి సంబంధించిన కేసులు పెడతామంటే పెట్టుకోండి. మీరు ఎలాంటి ఇబ్బందులైనా చేసుకోండి. మీరు చేయాలనుకుంటే ఒకటే చెప్తున్నాం.. కొత్త జైళ్లు పెట్టుకోండి. మీకున్న జైళ్లలో మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసి పెడతానంటే మీ జైళ్లు కూడా సరిపోవు. మీరు ఈరోజు పాలన వదిలేసి పోలీస్ యంత్రాంగం ఎవరి మీద కేసులు కట్టాలి.. ఎవరికి నోటీసులు పంపాలి అనే దానిపైనే పాపం ఎక్కువగా ఆలోచిస్తున్నారు.
ఈ జిల్లాలో కొంతమంది రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన వారు ఉన్నారు. వారికి రాజకీయం కొత్త అన్న కొత్త మోజులో మేమే శాశ్వతంగా ఉంటాం మేమే రాజకీయాలను ఏలబోతున్నాం అనుకుంటున్నారు. రాజకీయం అనేది ఎవ్వరి చేతుల్లో ఎవడి అబ్బా సొత్తు కాదు. ఒకరోజు మీరుంటారు.. మేమున్నాం.. ఈరోజు మీరొచ్చారు.. రేపు మేమొస్తాం. మాకు చేతకాదు అనుకుంటున్నారేమో. మూల్యం చెల్లిస్తారు. నోటీసులు ఇస్తే వైసీపీ కార్యకర్తలు రారు అనుకుంటున్నారేమో. మాకేమీ పోరాటాలు కొత్త కాదు. వైసీపీ పుట్టిన రోజు నుంచి దాదాపు 16 సంవత్సరాలలో పదేళ్లు ప్రతిపక్షంలో ఉండి పోరాడిన వాళ్లమే.
రేపు కూడా మీరు కేసులు పెడతారనో భయపడేవారు ఎవ్వరూ లేరు. ఉదయగిరిలో ఉన్న సీతారాంపురం నుంచి తడ కానీ వెంకటగిరి కానీ తెట్టు కానీ ప్రతి ఒక్క ఊరి నుంచి ఏదైతే మారుమూల జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తను ఒక్కటే అడుగుతున్నా. తరలి రండన్నా. ఒకడుగు ముందుకు మీరు వేయండి. తప్పకుండా రేపు జగనన్న తరఫున నెల్లూరు జిల్లా సత్తా చాటాల్సిన సమయం ఆసన్నమైంది. ఎంత మంది ఎన్ని పోలీసులు పెట్టి ఆపుతారో అది కూడా చూస్తాం. పోలీసులు పనులు వదిలేసి పడిగాపులు కాస్తూ కార్యకర్తలను ఆపే పనిగా పెట్టుకున్న ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది.
మేం కేవలం 2000 మందిని తీసుకుని జగన్ వెంట వెళ్లాలి అనుకున్నాం. కానీ మీరు ఆంక్షలు కావాలనే పెడుతున్నారు కాబట్టి అంతకు రెట్టింపు మంది వస్తారు. జగన్ అరాచక శక్తి కాదు కదా. మాజీ ముఖ్యమంత్రి. ఒక మాజీ ముఖ్యమంత్రి తన పార్టీ నేత జైల్లో ఉంటే పలకరించడానికి వెళ్తుంటే మీకేంటి బాధ? మీరే ఎగతాళి చేస్తున్నారు కదా వైసీపీకి 11 సీట్లే వచ్చాయి.. జగన్‌కి ఇంక ఏమీ మిగల్లేదు అని. మరెందుకు ఆంక్షలు పెడుతున్నారు? భయపడుతున్నారా? ఉచ్చ పడుతోందా కూటమి నేతలకు? మీరు ఎన్ని కేసులైనా పెట్టుకోండి. కార్యకర్తలపై కేసులు పెట్టాలనుకుంటే ముందు మామీద పెట్టండి మేం భరిస్తాం “” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు.