Allu Arjun Father In Law: నా ఇల్లు కూల్చకండి అంటూ హైడ్రా ప్రజావాణికి అర్జీ పెట్టుకున్నారు అల్లు అర్జున్ మామగారు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి. కేబీఆర్ పార్క్ వద్ద రోడ్డు విస్తరణలో తన ఇల్లు స్థలం ఒకవైపు 20 అడుగులు, మరోవైపు 36 అడుగుల భూమిని సేకరించే అంశంపై వివరణ ఇవ్వాలని కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి హైడ్రాను కోరారు. తన ఇంటి స్థలం సేకరణపై పునరాలోచన చేయాలని ప్రజావాణిలో అధికారులను కోరారు. ఆల్రెడీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్‌కి మధ్య ఏం జరిగిందో అందరికీ తెలిసిందే.
పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడంతో ఆయనకు బాగా మండింది. కానీ ఏమీ అనలేని పరిస్థితి. అందుకే టైం వచ్చినప్పుడు కొడదాంలే అనుకున్నాడు. అల్లు అర్జున్ కర్మ కాలి పుష్ప 2 రిలీజ్ సమయంలో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం.. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లడం జరిగిపోయాయి. ఇదే మంచి సమయం అనుకున్న రేవంత్ రెడ్డి అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేయించాడు. ఆ తర్వాత అర్జున్ రూ.4 కోట్లు ఖర్చు పెట్టి బయటికి రావాల్సి వచ్చింది. ఇప్పుడు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి పెట్టుకున్న అర్జీని హైడ్రా స్వీకరించినా.. రేవంత్ స్వీకరిస్తారో లేదో చూడాలి.