Neripureeswar Temple చాలా మందికి చెడు వ్యసనాలు ఉంటాయి. దాని నుంచి బయటపడాలనుకుంటారు కానీ వారి వల్ల కాదు.
వైద్యుల వద్దకు కూడా వెళ్తుంటారు కానీ మార్పు అనేది మనలో మొదలైతేనే కదా ఏదన్నా సాధ్యమయ్యేది. ఆ మార్పుని తెచ్చే ఆలయం గురించి తెలుసా?
ఆ ఆలయం పేరేంటంటే.. నెరిపూరేశ్వర ఆలయం. ఇది తమిళనాడులోని అచ్యుత్తంపెట్టయ్ ప్రాంతంలో ఉంది. ఇక్కడి దైవాన్ని నెర్రేశ్వర స్వామి అంటారు. అమ్మవారి సమేతంగా స్వామి వారు దర్శనం ఇస్తారు.
నెరి అంటే కార్చేయడం అని అర్థం. అంటే.. చెడు వ్యవసనాలను ఇట్టే వదిలించేస్తారు స్వామి వారు అని నమ్ముతారు. ఈ ఆలయ ప్రత్యేకత ఇక్కడ లభించే తీర్థం.
ఆలయంలోని కొలనులో స్నానం చేసి స్వామి వారికి అభిషేకం చేసి పూజారి ఇచ్చే తీర్థాన్ని 11 రోజుల పాటు స్వీకరిస్తే మనిషిలో తప్పకుండా మార్పు కనిపిస్తుందని చెప్తారు.
దాదాపు 30 వేల మందికిపైగా బాధితులు ఇక్కడికి వచ్చి మరీ కొత్త జీవితాన్ని ప్రారంభించిన వారు ఉన్నారట.





