Fruits దేవుడు చేసిన మనుషులు అంటే అర్థముంది కానీ మనుషులు చేసిన పండ్లేంటి? అసలు మనుషులు పండ్లు తయారుచేయడం ఏంటి? అవి ప్రకృతి అందించినవే కదా అని అనుకుంటున్నారా? కాదు. ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. మనం రోజూ తినే సహజమైన పండ్లన్నీ కూడా మనుషులు సృష్టించినవే అంటే నమ్ముతారా? ఇంతకీ అవేం పండ్లో…. మనుషులు వాటిని ఎలా సృష్టించారో తెలుసుకుందాం. మనుషులు సృష్టించిన పండ్లు అంటే రైతులు, శాస్త్రవేత్తలు కలిసి రెండు, మూడు చెట్లను కలిపి మరో చెట్టును సృష్టించి దాని నుంచి వచ్చిన పండ్లే ఇప్పుడు మనం తరచూ మార్కెట్లలో చూస్తుంటాం.
ఏంటా పండ్లు?
అరటి (Banana)
స్ట్రాబెర్రీ (Strawberry)
నారింజ (Orange)
ద్రాక్ష (Grapes)
మల్బెర్రీ (Mulberry)
ఆల్ బుఖారా (Plum)
పైనాపిల్ (Pineapple)
యాపిల్ (Apple)
అరటి పండ్లు మనం రోజూ తినేదే. ఇది అరటి చెట్టు నుంచి వస్తుందని మనకు తెలుసు కానీ ఆ అరటి చెట్టును శాస్త్రవేత్తలు, రైతులు కలిసి సృష్టించినదే. ఒకప్పుడు అరటి పండ్లలో గింజలు ఉండేవి. రెండు మూడు విత్తనాలను కలిపి నాటిన మొక్క నుంచి గింజలు లేకుండా మెత్తగా తియ్యగా ఉండే అరటి పండ్లు కాస్తున్నాయి.
స్ట్రాబెర్రీలు ఒకప్పుడు మరీ చిన్నగా, పుల్లగా లభించేవి. ఉత్తర అమెరికా నుంచి ఒక విత్తనాన్ని, చిలీ నుంచి మరో విత్తనాన్ని తెచ్చి ఒక హైబ్రిడ్ మొక్కకు కనిపెడితే దాని నుంచి ఇప్పుడు మనం తింటున్న స్ట్రాబెర్రీలు కాస్తున్నాయి.
పోమెలో, మాండరిన్ అనే పండ్ల నుంచి హైబ్రిడ్ రూపంలో పుట్టినదే నారింజ. పొమెలో అనేది సిట్రస్ జాతిలోనే అతిపెద్ద పండు అని చెప్తారు. ఆగ్నేయ ఆసియాలో ఎక్కువగా పండిస్తారు. దీనిని పచ్చిగా తినచ్చు లేదా వండుకోవచ్చు కూడా. దానిని కాస్త తియ్యగా తినగలిగేలా ఉండేందుకు సృష్టించారట.
ఇక ద్రాక్ష విషయానికొస్తే నారింజ, పొమెలో పండు నుంచి సృష్టించిన పండు. దీనిని అనుకోకుండా సృష్టించారు కానీ అత్యంత ఆరోగ్యకరమైన పండుగా నిలవడంతో సాగు చేయడం కొనసాగించారట.
ఒకప్పుడు యాపిల్ పండ్లు తేనె అంత తియ్యగా.. నాటుగా ఉండేవట. ఇప్పుడు యాపిల్ పండ్ల నుంచి లభిస్తున్న రుచి కోసం రకరకాల చెట్ల విత్తనాలు వేసి మరీ కావాల్సిన రుచి వచ్చే వరకు ప్రయత్నించగా..ఇప్పుడు మనం తినే యాపిల్ పండ్లు పుట్టుకొచ్చాయి.
మిగతా పండ్లు కూడా వందల సంవత్సరాల పాటు రకరకాల విత్తనాలతో ప్రయోగాలు చేసి పుట్టించినవే.