Elon Musk ట్రిలియనేర్ ఎలాన్ మస్క్‌కి 14 మంది పిల్లలు ఉన్నారన్న సంగతి తెలుసా? ఆయనకు 14 మంది పిల్లలున్నారన్న విషయం కంటే.. ఆయనకు వారికి పెట్టిన పేర్లు ఇంకా వైరల్‌గా ఉంటాయి. మస్క్‌కి ఉన్న పిల్లల్లో భారత సంతతికి చెందిన యువతితో కన్న బిడ్డ కూడా ఉన్నాడు. వాడి పేరు స్ట్రైడర్ శేఖర్. శేఖర్ మస్క్‌కి తొమ్మిదవ సంతానం.
మస్క్ తన తొమ్మిదవ కుమారుడికి స్ట్రైడర్ శేఖర్ అని పేరు పెట్టడం వెనుక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఫిజిక్స్‌లో నోబెల్ ప్రైజ్ అందుకున్న సుబ్రమ్మణ్యం చంద్రశేఖర్‌ను ఆదర్శంగా తీసుకుని శేఖర్ అనే పేరు పెట్టారు. ఇక స్ట్రైడర్ అనేది అమెరికన్ సిరీస్ అయిన లార్డ్ ఆఫ్ రింగ్స్‌లో ఫేమస్ ఫిక్షనల్ క్యారెక్టర్ ఆరాగోర్న్ నుంచి స్ఫూర్తిగా తీసుకుని పెట్టారు. ఇక శేఖర్ తల్లి పేరు శివోన్ జిలిస్. ఈమె పంజాబీ. కెనడాలో పుట్టి యేల్ యూనివర్సిటీలో చదువుకుంది. టెస్లాలోని ఆటోపైలట్, చిప్స్ టీమ్‌తో వర్క్ చేసింది. అలా వర్క్ చేస్తున్న సమయంలోనే మస్క్‌తో శివోన్ రిలేషన్‌షిప్ మొదలైంది. అలా పుట్టినవాడే శేఖర్. శివోన్ జిలిస్‌తో మస్క్ నలుగురు పిల్లలను కన్నారు. మస్క్ 14 మంది పిల్లల పేర్లు ఏంటో తెలుసా?
నెవాడా
వివియన్
గ్రిఫిన్
కాయ్
సాక్సోన్
డామియన్
X A-12
ఎక్సా
స్ట్రైడర్ శేఖర్
ఎజ్యూర్
టెక్నో
ఆర్కాడియా
సెల్డన్ లైకుర్గస్
రోమ్యులస్
ఇంతకీ మస్క్ ఇంత మంది పిల్లల్ని ఎందుకు కంటున్నాడో తెలుసా? అమెరికాలో జనాభా తగ్గిపోతోందట. అందుకే ఈయన కంటూ పోతున్నాడు. తన మార్స్ మిషన్‌లో భాగంగా కూడా ఇలా కంటున్నానని.. మార్స్‌లో నివసించే తొలి జనాభా తన పిల్లలే కావాలని అంటున్నారు.





