Akhil Akkineni Wedding: అక్కినేని వారసుల్లో పెద్దోడి పెళ్లి గతేడాది ఘనంగా జరిగింది. అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాలల వివాహం గతేడాది డిసెంబర్‌లో అన్నపూర్ణ స్టూడియోస్‌లో దివంగత నేత అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ముందు జరిగింది. అయితే.. ఇప్పుడు తమ్ముడు అఖిల్ కూడా తన అన్న స్టైల్‌నే ఫాలో అవ్వాలనుకుంటున్నాడు. నాగచైతన్య పెళ్లి డేట్ ఫిక్స్ చేసినప్పుడే అఖిల్ కూడా పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అందరినీ సర్‌ప్రైజ్ చేసాడు.
జైనాబ్ రవిద్జీ అనే అమ్మాయితో అఖిల్ పెళ్లి జరగనుంది. జైనాబ్ ప్రముఖ వ్యాపారవేత్త అయిన జుల్ఫీ రవిద్జీ కూతురు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో జుల్ఫీ ప్రభుత్వ సలహాదారుగా పనిచేసారు. ఈయన జగన్‌కి నాగార్జునకు మంచి మిత్రుడు. అయితే.. అఖిల్ కంటే జైనాబ్ దాదాపు 11 ఏళ్లు పెద్దది. ఇప్పుడు జైనాబ్ వయసు 39. ఈమె పెయింటర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. జైనాబ్‌కు వన్స్ ఆపాన్ ది స్కిన్ అనే స్కిన్ కేర్ బ్రాండ్ కూడా ఉంది. ఈమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 50 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. కాకపోతే ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ప్రైవేట్‌లో పెట్టుకున్నారు. కనీసం డిస్‌ప్లే పిక్చర్ కూడా పెట్టలేదు. దీనిని బట్టి చూస్తే ఆమె చాలా ప్రైవేట్ పర్సన్ అని తెలుస్తోంది. జైనాబ్ తండ్రి జుల్ఫీ నాగార్జునకు మంచి మిత్రుడు కావడంతో ఇరు కుటుంబాలకు మంచి అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలో అఖిల్ జైనాబ్ కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నారు (Akhil Akkineni Wedding)
పెళ్లి ఎప్పుడు?
అఖిల్, జైనాబ్‌ల వివాహాన్ని మార్చి 24న నిర్వహించాలని అక్కినేని కుటుంబం ప్లాన్ చేసుకుంటోంది. నాగచైతన్య లాగే డెస్టినేషన్ వెడ్డింగ్‌లా కాకుండా అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే పెళ్లి చేసుకోవాలని అఖిల్ నిర్ణయించుకున్నారట. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, సినీ, రాజకీయ, పారిశ్రామిక రంగాలకు చెందిన వీఐపీల సమక్షంలో వివాహం జరగనుంది. జైనాబ్ అఖిల్ కంటే తొమ్మిదేళ్లు పెద్దది. ఇద్దరి మనసులు కలిసాయి కాబట్టి నాగార్జున కూడా ఈ విషయంలో అభ్యంతరం చెప్పలేదట.
2016లో అఖిల్.. ప్రముఖ వ్యాపారవేత్త GVK రెడ్డి మనవరాలైన శ్రియా భూపాల్‌ని ప్రేమించాడు. ఇరు కుటుంబీకులు ఒప్పుకోవడంతో 2016 డిసెంబర్‌లో వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. అయితే నిశ్చితార్థం అయిన కొన్ని నెలల్లోనే అఖిల్, శ్రియల మధ్య మనస్పర్థలు రావడంతో పెళ్లి ఆగిపోయింది. ఆ తర్వాత శ్రియ వేరొకరిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయారు. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లోనే ఇద్దరి మధ్య ఏదో గొడవ జరిగిందని ఆ గొడవ కారణంగానే ఇద్దరూ విడిపోయారని కొంతకాలం పాటు టాక్ నడిచింది. ఏదేమైనప్పటికీ నాగార్జున ఇద్దరు కొడుకులు ఓ ఇంటివారు కాబోతున్నారు. అక్కినేని కుటుంబంలో సంబరాలు అంబరాన్నంటుతున్నాయి.
ఇక అఖిల్ సినిమాల విషయానికొస్తే ఆయన చివరిగా నటించిన ఏజెంట్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దాంతో ఈసారి మాత్రం ఏదన్నా మంచి కథతో ప్రేక్షకుల ముందుకు రావాలన్న దృఢ సంకల్పంతో అఖిల్ ఉన్నాడు. అందుకే కాస్త లేట్ అయినా మంచి హిట్‌తో రావాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఎన్నో కథలు విన్న అఖిల్ ఇంకా తన తదుపరి సినిమా గురించి డిసైడ్ అవ్వలేదు. (Akhil Akkineni Wedding)