Ajit Pawar మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన నేపథ్యంలో మహిళా పైలట్ల గురించి ఆయన గతంలో చేసిన ట్వీట్ ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది.
2024 జనవరిలో పవార్ మహిళా పైలట్లను ఉద్దేశిస్తూ ఒక ట్వీట్ చేసారు. “” మేం హెలికాప్టర్లలో కానీ విమానాల్లో కానీ ప్రయణిస్తున్నప్పుడు సురక్షితంగా ల్యాండ్ అయితే కచ్చితంగా మహిళా పైలట్లే వాటిని నడుపుతున్నారని అర్థం “” అని ఆయన ట్వీట్ చేసారు.
2026 జనవరి 28న ఆయన ప్రయాణించిన విమానంలోని కో పైలట్ ఓ మహిళే కావడంతో ఇప్పుడు దూలతీరిందా అంటూ ఓ వ్యక్తి ఆయన చేసిన ట్వీట్ కింద కామెంట్ పెట్టడం వివాదాస్పదంగా మారింది.
పైలట్ తప్పిదమే
పవార్ ప్రయాణించిన చార్టర్ విమానం బ్లాక్ బాక్స్ లభ్యం కావడంతో విచారణ మొదలుపెట్టారు.
పైలట్ బారామతిలో ల్యాండ్ అవ్వడం కంటే పుణెలో ల్యాండ్ అయ్యుంటే ప్రమాదం తప్పి ఉండేదని.. ఆ అవకాశం ఉన్నా ఆయన ఎందుకు బారామతిలోనే ల్యాండ్ చేయాలనుకున్నారో అర్థంకావడం లేదని అధికారులు చెప్తున్నారు.





