Adivi Sesh: వైవిధ్యమైన కథలను ఎంపిక చేసుకుని హిట్స్ కొడుతుంటారు నటుడు అడివి శేష్. అందుకే ఆయన నుంచి ఏడాదికో రెండేళ్లకో ఓ సినిమా వస్తుంటుంది. త్వరలో ఆయన డెకాయిట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించారు. ఈరోజు AAA థియేటర్‌లో సినిమాకు సంబంధించిన ఈవెంట్‌ను నిర్వహించారు. అయితే.. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అడివి శేష్ ట్విటర్‌లో నెటిజన్స్‌తో సంభాషించారు.
పది ట్వీట్లలో 6 మంది సినిమా గురించి అడగ్గా.. మిగతా వారంతా మృణాల్ గురించి అడగడంతో అడివి శేష్ కాస్త జలస్ ఫీలయ్యారు. ఒక నెటిజన్.. ఈవెంట్‌కి మృణాల్ ఠాకూర్ వస్తోందా బ్రో? ఆమె కోసమే 70 కిలోమీటర్లు ప్రయాణించి మరీ రావాలి అని అడివి శేష్‌ని అడిగాడు. ఇందుకు శేష్ స్పందిస్తూ.. ఆ వస్తోంది అంటూ మూతి తిప్పుకున్న ఎమోజీతో రియాక్ట్ అయ్యారు. అందరూ మృణాల్ గురించే ఎదురుచూస్తున్నారని ఫీలవుతున్నారా బ్రో అంటూ సరదాగా నెటిజన్లు కామెంట్స్‌లో ఆటపట్టించారు.





