Acid Attack On Gautami: అన్నమయ్య జిల్లాలో ఓ యువతిపై వ్యక్తి యాసిడ్ దాడి చేసిన ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ దాడి చేసింది ఎవరో కాదని.. తెలుగు దేశం పార్టీకి చెందిన కదిరి ఎమ్మెల్యే వెంకటప్రసాద్ ముఖ్య అనుచరుడు మురళీ కుమారుడు గణేష్ అని ట్విటర్ వేదికగా ఆరోపిస్తున్నారు.
ఆ గణేష్ అనే వ్యక్తి తెలుగు దేశం పార్టీ కార్యకర్తే అని.. పాపం బ్యూటీ పార్లర్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న గౌతమిపై యాసిడ్ దాడికి పాల్పడిన వాడికి తెలుగు దేశం, కూటమి ప్రభుత్వాలు వత్తాసు పలుకుతున్నాయని అన్నారు. గణేష్ తండ్రి మురళీకి TDP నేతలతో సత్సంబంధాలు ఉన్నాయని.. దాంతో రాజీ కోసం TDP నేతలు విశ్వప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.