AB de Villiers: మాజీ దక్షిణాఫ్రికా బ్యాటర్ ఏబీ డివిలియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు శుభవార్త చెప్పాడు. 2026 ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మరోసారి RCBలోకి రీఎంట్రీ ఇవ్వనున్నట్లు చెప్పకనే చెప్పాడు. చివరిసారిగా 2021 IPLలో IPL తరఫున ఆడిన డివిలియర్స్ ఆ తర్వాత అన్ని ఫాంలకు రిటైర్మెంట్ ప్రకటించాడు.
అయితే.. 2026లో మరోసారి ఎంట్రీ ఇవ్వనున్నట్లు వెల్లడించిన డివిలియర్స్.. ప్లేయర్‌గా కాకుండా కోచ్ లేదా మెంటార్‌గా వస్తానని అన్నాడు. అయితే.. ఒకవేళ ఆడాలనుకుంటే మాత్రం కచ్చితంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫునే ఆడతానని వెల్లడించారు. 2008లో ఢిల్లీ డేర్ డెవిల్స్ తరఫున ఆడి ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చాడు డివిలియర్స్. ఆ తర్వాత 2011లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులోకి వచ్చాడు. అప్పటి నుంచి 2021 వరకు బెంగళూరు తరఫునే ఆడుతూ వచ్చాడు.