Nara Lokesh కూటమికి విడాకులు లేవని స్పష్టం చేసారు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్. అన్న పవన్ కళ్యాణ్ చెప్పినట్లు ఈ కూటమి ప్రభుత్వం 15 ఏళ్లు అధికారంలో ఉండాలని అన్నారు.
కూటమి అంటే సమస్యలు ఉంటాయి, నేను కాదు అనను, వాటిని కూర్చొని పరిష్కరించుకోవాలి అని వ్యాఖ్యానించారు.
తన తండ్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పనిచేయడం చాలా కష్టమైన పని అని.. అందుకే చిక్కిపోయానని చమత్కరించారు.





