Joint Pains పసుపు కొమ్ములు చూసే ఉంటారు. కానీ నల్ల పసుపు గురించి తెలుసా? సాధారణ పసుపు ఎంత పవర్‌ఫులో ఇది దానికి డబుల్ పవర్‌ఫుల్ అనే చెప్పాలి.
పసుపు కొమ్ము లోపల నీలం లేదా నల్ల రంగులో ఉంటుంది. మోకాళ్ల నొప్పులకు ఇదో వరం అనే చెప్పాలి. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీలు వాపును కూడా తగ్గిస్తాయి.
ఒకవేళ నల్ల పసుపు మీకు దొరికితే కచ్చితంగా వారంలో ఒకసారైనా నీటిలో మరిగించి టీగా చేసుకుని తాగండి. నొప్పులు ఉన్నవారే కాదు.. ఎవరైనా తాగచ్చు.
చిటికెడు ముక్క వేసి నీటిని మరిగించి అందులో కాస్త మిరియాలు వేసుకుని తాగితే శరీరంలో జరుగుతున్న మార్పులు మీరే చూస్తారు.
కాకపోతే బ్లడ్ థిన్నర్లు, డయాబెటిక్ మందులు తీసుకుంటున్నవారు వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది. ఈ నల్ల పసుపు సాధారణ పసుపు కంటే స్ట్రాంగ్‌గా ఉంటుంది కాబట్టి కడుపు ఉబ్బరంగా ఉండటం, కడుపు నొప్పి వంటివి ఉంటాయి.
దీని అర్థం అది బాగా పని చేస్తోందని. ఒకవేళ తాగిన ప్రతీసారి వస్తుంటే మాత్రం ఆపేయండి.





