Kurudumale Ganesha Temple చాలా మంది రాజకీయ నాయకులు ఎన్నికల్లో గెలవాలనో.. లేదా ఏదన్నా ముఖ్యమైన పని అవ్వాలనో కోరుకుని ఈ ఆలయానికి వెళ్తే వారి కోరిక నెరవేరిపోతుందని నమ్ముతారట.
అదే ఆలయమో తెలుసా? కర్ణాటకలోని కురుడుమలేలో ఉన్న వినాయకుడి ఆలయం. ఆలయం పేరు కూడా కురుడుమలే వినాయక ఆలయం.
ఇది చాలా చిన్న గుడి. స్థానికులకు తప్ప ఎవ్వరికీ అంతా తెలీదు. కానీ మన తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకకు చెందిన పలువురు రాజకీయ నాయకులు ఈ ఆలయానికి తరచూ వెళ్తుంటారట.
ఎలాంటి ఆర్భాటం, హంగామా లేకుండా వెళ్లి స్వామి వారిని దర్శించుకుని వచ్చేస్తుంటారు. ఇక్కడ స్వామి వారు 11 అడుగుల ఎత్తు ఉంటారు. విగ్రహం స్వయంభువు అయినప్పటికీ కాస్త వంగి ఉంటుందట.
దీనిని పరశురాముడు ప్రతిష్ఠించినట్లు చెప్తారు. ఇక్కడ వెన్నను ప్రసాదంగా ఇస్తారు. ఏ కోరిక ఉన్నా.. ఏదన్నా పని అవ్వకపోయినా.. కోర్టు సమస్యలు ఇతర ఇబ్బందులు ఉన్నా స్వామి వారికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్లు సమర్పించి 3, 11, 108 ప్రదక్షిణలు చేస్తే కచ్చితంగా పని అయ్యి తీరాల్సిందే.
వీటి కంటే ఎంతో ముఖ్యమైనది ఏంటంటే.. మీరు ప్రదక్షిణలు చేసినా చేయకపోయినా ఒక్క 20 నిమిషాల పాటు స్వామి ముందు కూర్చుంటే ఆయన్న ప్రసన్నుడవుతాడట.
కొందరికి ఒక్కసారి వెళ్లగానే పని అవ్వకపోవచ్చు. అలాగని వదిలేయకుండా ఆరు నెలల్లో మూడు సార్లు అలా వెళ్లగలిగితే పని తప్పకుండా అవుతుందని భక్తులు నమ్ముతారు.





