Jagan అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలకు జీతాలు ఇవ్వడం సరికాదని ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
దీనిపై ఓ రిపోర్టర్ సర్.. అసెంబ్లీకి రాకపోతే జీతాలు ఇవ్వం అంటున్నారు దీనిపై మీ స్పందనేంటి అని జగన్‌ను అడిగారు. దీనికి జగన్.. జీతాలపై ఆధారపడేంత పేదవాళ్లు కాదు మావాళ్లు అని నవ్వుతూ సమాధానం ఇవ్వడం వైరల్‌గా మారింది.
ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్‌తో పాటు గెలిచిన పది మంది ఎమ్మెల్లో ఏ ఒక్కరు కూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావడం లేదన్న సంగతి తెలిసిందే. కేవలం ఎమ్మెల్సీలు మాత్రమే కౌన్సిల్ సమావేశాలకు హాజరువుతున్నారు.





