Jagan Mohan Reddy ప్రతీదీ ప్రైవేట్ పరం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. తన సీఎం కుర్చీని కూడా ప్రవేట్ పరం చేయొచ్చు కదా అని చమత్కరించారు వైఎస్సార్ కాంగ్రెస్ నేత జగన్ మోహన్ రెడ్డి.
అందుకే PPP విధానం అమల్లోకి రాలేదని.. బిడ్డర్లు కూడా చంద్రబాబు నాయుడు కుట్రను పసిగట్టి వేలానికి రాలేదని అన్నారు. ఇంకో మూడేళ్లు కళ్లు మూసుకుంటే మళ్లీ ఎన్నికలు వస్తాయని.. అప్పుడు అధికారంలోకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వస్తుందని అన్నారు.
ప్రతీ ఇంట్లో జగన్ ఉన్నప్పుడే బాగుండేది.. కనీసం ఏదో ఒక బటన్ నొక్కుతూ ఉండేవాడు అని మాట్లాడుకుంటున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాదిలో పాదయాత్ర ప్రారంభిస్తున్నట్టు స్పష్టంచేసారు.
ఆ లోపు ప్రతి వారం ఒక నియోజకవర్గం కార్యకర్తలు, నాయకులతో సమావేశం అవుతానని ప్రకటించారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాకే జనాలకు తన విలువ తెలిసిందని అన్నారు.





