Modi Trump భారత ప్రధాని నరేంద్ర మోదీ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రాప్‌లో పడకుండా ఆయన కుట్రను ముందుగా పసిగట్టారనే చెప్పాలి.
అగ్ర రాజ్యానికి అధ్యక్షుడిగా ఉండి కూడా ట్రంప్ చిన్న పిల్లాడిలా వ్యవహరిస్తూ దేశాన్ని నడపడం అంటే అదేదో ఆట బొమ్మ అనుకుంటున్నాడు. ట్రంప్ ఎంత మంచిగా మాట్లాడినా.. ఎంత మద్దతు ఇచ్చినా.. తనకు కావాల్సింది దక్కించుకోవడానికి స్నేహం, ప్రేమ వంటివి చూపించడు అని మోదీకి ఎప్పుడో అర్థమైంది.
అందుకే ఆయన ట్రాప్‌లో పడకుండా ఇటు భారత్‌కూ దెబ్బ పడకుండా జాగ్రత్తపడ్డారు. ట్రంప్ కుట్రను భారత్ ముందే పసిగట్టింది కానీ అమెరికాకు స్నేహపూర్వకంగా ఉండే యూరప్ ఇతర దేశాలు పసిగట్టలేకపోయాయి.
ట్రంప్‌కి ఏదన్నా కావాలంటే ఒక దేశానికి అధ్యక్షుడిగా కాదు ఒక వ్యాపారవేత్తగా వ్యవహరిస్తాడు అని మనకు ఆల్రెడీ అర్థమైంది. అవసరానికి తగ్గట్టు భౌగోళిక రాజకీయ ఆయుధాన్ని వాడటంలో ట్రంప్‌ను మించినోళ్లు లేరు.
పాకిస్థాన్, భారత్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని సొంత డప్పు కొట్టుకుంటుంటే అంత సీన్ లేదు.. ఇది రెండు దేశాలు కూర్చుని తీసుకున్న నిర్ణయం మాత్రమే అని భారత్ మర్యాదపూర్వకంగా బదులిచ్చింది.
కానీ పాక్‌కి అమెరికా అవసరం ఉంది కాబట్టి ఆహా ట్రంప్ ఓహో ట్రంప్‌ని నెత్తికెక్కించుకున్నాయి. భారత్ అలాంటి పనులు ఏమీ చేయలేదు. అందుకే ట్రంప్ భారత్‌ను కూడా లొంగదీసుకోవాలన్న ఉద్దేశంతో ట్యారిఫ్‌లు విధించారు.
భారత్ కూడా ట్రంప్ రియలైజ్ అయ్యేలోపే పప్పుదినుసులపై 30% ట్యారిఫ్‌లను సైలంట్‌గా విధించి బుద్ధి చెప్పింది. ఒకవేళ ట్రంప్ ట్యారిఫ్‌లకు భయపడి మోదీ తలొగ్గి ఏ ట్రేడ్ పడితే ఆ ట్రేడ్‌కి డీల్ కుదుర్చుకుని ఉంటే తీవ్రంగా నష్టపోయి ఉండేవాళ్లం.
మోదీ సమన్వయంతో వ్యవహరిస్తూ ఎలాంటి ఒత్తిడికి తలొగ్గకుండా రష్యా నుంచి చమురు దిగుమతులను ఆపలేదు. ఈ విధంగా భారత్‌కు అమెరికానే దిక్కు అనేది తప్పని తెలియజెప్పాం.
ట్రంప్ చేసే వెధవ పనులు మనకు తెలుసు కాబట్టే ట్రంప్ ప్రెస్ మీట్ పెట్టి ఏది పడితే అది వాగకముందే భారత విదేశాంగ శాఖ జరిగిన విషయం ఇది అని స్పష్టం చేస్తూ వస్తోంది.





