ChatGPT ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంతరించుకున్న చాట్ జీపీటీ వల్ల జనాలకు ప్రాణహాని ఉందని ఆరోపించారు టెస్లా అధినేత ఎలాన్ మస్క్. మానసిక సమస్యలతో బాధపడుతున్నవారు చాట్ జీపీటీని వాడి ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు ఉన్నాయని మస్క్ అన్నారు.
దీనిపై చాట్ జీపీటీ సంస్థ ఓపెన్ ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మ్యాన్ స్పందించారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 కోట్ల మంది జీపీటీని వాడతారని వారిలో మానసిక రోగులు ఉన్నప్పటికీ వారి పరిస్థితి దృష్టిలో ఉంచుకునే తమ జీపీటీ సమాధానాలు ఇస్తుందని మస్క్ ఆరోపణలను తిప్పి కొట్టారు.
మస్క్ ఆటోపైలట్ టెస్లా కారు వల్ల ఎన్నో ప్రాణాలు పోయాయని ఆయన దాని గురించి పట్టించుకుంటే బాగుంటుందని అన్నారు. అసలు ఎలాంటి టెస్టింగ్‌లు చేయకుండానే ఆటోపైలట్ కారు సేల్స్‌ని మొదలెట్టేసారని ఆరోపించారు.
ఒకప్పుడు ఓపెన్ ఏఐలో మస్క్, ఆల్ట్‌మ్యాన్ కలిసే పని చేసారు. ఆ తర్వాత భిన్నాభిప్రాయాల కారణంగా విభేదాలు ఏర్పడ్డాయి. మస్క్ తన సంస్థ అయిన ఎక్స్ ద్వారా గ్రోక్ అనే జీపీటీని ప్రవేశపెట్టారు. కానీ గ్రోక్ వల్ల ఎలాంటి అసభ్యకరమైన ఫోటోలు బయటికి వస్తున్నాయో అందరికీ తెలిసిందే.





