Sunil Gavaskar IPLలో తెగ ఆడేస్తున్నారు కదా అని యువ క్రికెటర్లను ఓహో ఆహా అని పొడిగేస్తే ఇలాగే ఉంటది అంటూ చురకలంటించారు సీనియర్ క్రికెటర్ సునీల్ గవాస్కర్. యువ కెరటం వైభవ్ సూర్యవంశి విషయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు.
గతేడాది ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన వైభవ్ విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. సచిన్, విరాట్ తర్వాతే వైభవే అంటూ తెగ పొగడ్తలతో ముంచెత్తారు. ఈ నేపథ్యంలో సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేసారు.
తాను ఎంతో మంది యువ క్రికెటర్లను చూసానని.. ఐపీఎల్ వంటి ఆటల్లో బాగానే ఆడి తీరా U19 వరల్డ్ కప్ దగ్గరికి వచ్చేసరికి తడబడుతుంటారని అన్నారు. తొందరపడి కోయిల ముందే కూసింది అన్న చందాన వారి ఆట తీరు ఉంటోందని అన్నారు. కాబట్టి ప్రస్తుతం వైభవ్‌తో పాటు ఇతర యువ క్రికెటర్లు ఈ పొగడ్తలకు పడిపోకుండా U19 వరల్డ్ కప్‌పై ఫోకస్ చేయాలని అన్నారు.





