US India అమెరికాకు తెలీకుండానే భారత్ సైలెంట్‌గా ట్యారిఫ్‌ల దెబ్బేసింది. ట్యారిఫ్‌ల విషయంలో ఆల్రెడీ భారత్, అమెరికా దేశాల మధ్య టెన్షన్లు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ నుంచి అమెరికాకు ఎక్కువగా ఎగుమతయ్యే పప్పుదినుసుల విషయంలో భారత్ షాకిచ్చింది. గతేడాది అక్టోబర్‌లో పప్పుదినుసుల ఎగుమతులపై భారత్ 25% ట్యారిఫ్‌లు విధించింది. ఇది నవంబర్‌లో అమల్లోకి వచ్చింది. అయితే.. దీనిని భారత్ అధికారికంగా ప్రకటించకపోవడంతో విషయం బయటికి రాలేదు.
అమెరికాకి చెందిన కెవిన్ క్రామర్, స్టీవ్ డైన్స్ అనే ఇద్దరు సెనేటర్లు ఉన్నట్టుండి ఈ ట్యారిఫ్‌ల విషయంపై లేఖలు విడుదల చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. భారత్ ఇలా 25% ట్యారిఫ్‌లు విధించడంతో అమెరికాలోని రైతులకు కష్టంగా ఉందని వారు లేఖలో పేర్కొన్నారు. గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయ వస్తువలపై 50% కంటే ఎక్కువ ట్యారిఫ్‌లు విధించిన సంగతి తెలిసిందే. ఈసారి భారత్ ఎలాంటి హడావిడి చేయకుండా సైలెంట్‌గా అమెరికాకు షాకివ్వడం హైలైట్. అమెరికాలోని నార్త్ డకోటా, మోంటానా రాష్ట్రాలు మన పప్పుదినుసులపై ఆధారపడి ఉన్నాయి. దాదాపు 27% వరకు పప్పుదినుసులను భారత్ నుంచే వివిధ దేశాలు ఎగుమతి చేసుకుంటున్నాయి.





