Bandi Sanjay భారతీయ జనతా పార్టీ నేత బండి సంజయ్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి KCR, ఆయన కుమార్తె కల్వకుంట్ల కవితపై షాకింగ్ వ్యాఖ్యలు చేసారు. కవితను BRS పార్టీ నుంచి తొలగించిన నేపథ్యంలో ఆమె ఒంటరి అయిపోయిందని.. కవితక్కకి బీజేపీ అండగా ఉంటదని అన్నారు.
సొంత పార్టీ, కుటుంబం గెంటేసినా కవిత తన కాళ్లీ మీద తాను నిలబడాలనుకుంటోందని.. అందుకు కవితక్క హ్యాట్సాఫ్ అని అన్నారు. బీజేపీ తరఫున ఆమెకు పూర్తిగా సహకరిస్తామని అన్నారు. తనకున్న సమాచారం ప్రకారం జబర్దస్త్ రోజా ఇంటికీ వెళ్ళడం ఆమె పెట్టిన రొయ్యలు,పీతలు తినడం కవితక్కకి కూడా అస్సలు ఇష్టం లేదని, వద్దు బాపు మన ఇంట్లో చేసుకుందాం ఇవన్నీ అన్నా కూడా KCR వినలేదని బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు.





