Jada Sravan Kumar లేని పోని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ప్రజలకు పీకి చేసింది ఏమీ లేదని షాకింగ్ వ్యాఖ్యలు చేసారు జైభీం పార్టీ అధినేత జడ శ్రవణ్ కుమార్. ప్రజల డబ్బుతో ఎంజాయ్ చేస్తూ ప్రతి పండగకు విదేశాలకు చెక్కేస్తున్నారని.. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే రోజుకు మూడుసార్లు బాత్రూంకి వెళ్తున్నారని అన్నారు.
నిద్రలో జగన్ గుర్తుకు రాగానే ఉలిక్కి పడి లేచి నీళ్లు తాగాల్సిన పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని ఎద్దేవాచేసారు. తాను ముఖ్యమంత్రిని అవుతానో లేదో తెలీదు కానీ వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని.. అప్పుడు ఆయన అందరి లెక్కలు తేలుస్తారని హెచ్చరించారు.





