Testicular Torsion తిలక్ వర్మకు సడెన్ సర్జరీ అనడంతో ఇక తప్పక T20 వరల్డ్ కప్ స్వ్కాడ్ నుంచి ఆయన్ను తప్పించాల్సి వచ్చింది. తిలక్‌కు టెస్టిక్యులర్ టార్షన్ వచ్చిందని వైద్యులు అంటున్నారు. అసలేంటీ సమస్య?
ఇది వృషణాలకు సంబంధించిన సమస్య. వృషణాలకు సరైన రక్త సరఫరా జరగకపోతే విపరీతమైన నొప్పి సంభవిస్తుంది. ఇది ఇలాగే పట్టించుకోకుండా వదిలేస్తే ఆరు గంటల్లోనే వృషణం మొత్తానికే పనిచేయకుండా చచ్చుబడిపోతుంది. ఇది వచ్చినప్పుడు వృషణాల్లో విపరీతమై నొప్పి ఉంటుంది. పొత్తి కడుపులో నొప్పితో పాటు వికారం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
సాధారణంగా ఇది 12 నుంచి 18 ఏళ్ల పిల్లల్లో కనిపిస్తుంటుంది. ఒక్కసారిగా శరీరాన్ని కుదిపేసినా.. నిద్రలో తెలీక రాంగ్ పొజిషన్‌లో నిద్రపోయినా.. చలికాలంలో వృషణాల్లోని కండరాలు బిగుసుకుపోయినా.. ఇలా ఏదైనా కారణం వల్ల రావచ్చు. వృషణాల్లో నొప్పి అనిపించినప్పుడు వెంటనే వైద్యుల్ని సంప్రదించాల్సి ఉంటుంది. ఒకవేళ టెస్టిక్యులర్ టార్షన్ సమస్యే అని తెలిస్తే మాత్రం ఆరు గంటల్లోనే సర్జరీ చేయాల్సి ఉంటుంది. 12 గంటల తర్వాత అప్పటికే వృషణాలు డ్యామేజ్ అయ్యుంటాయి. ఇక 24 గంటలు దాటితే మాత్రం వాటిని తొలగించాల్సి ఉంటుంది.





